వంటకు ఏ కొబ్బరి నూనె వాడాలి?  సందేహాలు – సమాధానాలు (పార్ట్-6)

0
69

వీరమాచనేని రామకృష్ణారావు ఆహార విధానం పై మీ సందేహాలను మాకు వ్రాయండి. మీ ప్రశ్నలకు వీరమాచనేని రామకృష్ణ స్వయంగా సమాధానాలు ఇస్తారు. మీ ప్రశ్నలను క్రింద సూచించిన మెయిల్ ఐడీ లకు పంపించండి. ఇంతక్రితం సందేహాలు – సమాధానాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఇది కేవలం తెలుగు వారికోసం మాత్రమే కనుక  దయచేసి మీ ప్రశ్నలను తెలుగులో మాత్రమే పంపించాలని విజ్ఞప్తి.

1) janavijayam@gmail.com  2)  kondalarao.palla@gmail.com 

సందేహాలు – సమాధానాలు (పార్ట్ – 6)
                        వీరమాచనేని రామకృష్ణారావు తో “జనవిజయం” ఎడిటర్ పల్లా కొండలరావు
ప్రశ్న 57 : బి.పి పేషంట్లు ఈ విధానాన్ని ఎన్ని రోజులు చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వీరమాచనేని : కనీసం 15 రోజులు చేయాలి. వైద్యుని పర్యవేక్షణలో బి.పి తగ్గేవరకు అల్లోపతి మందులు వాడుతూ మన ఆహార విధానం పాటించాలి. స్వంతంగా మాత్రం నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. 

ప్రశ్న 58 : నేను వీరమాచనేని డైట్ వాడుతున్నాను. పాదాలలో చెమట వస్తున్నది. ఏమి చేయాలి?

వీరమాచనేని : పాదాలలో చెమటకు మన డైట్ కు సంబంధం లేదు. సాధారణంగా స్వేదగ్రందులనుండి చెమట వస్తే మంచిదే. గ్రందులన్నీ సక్రమంగా పనిచేస్తే శరీరానికి మంచిదే. అయితే బి.పి ఉందేమో చెక్ చేసుకుని ఉంటే అల్లోపతి వైద్యుని సంప్రదించి మందులు వాడుతూ ప్రోగ్రాం కంటిన్యూ చేయండి.

ప్రశ్న 59 : సర్, ‘టైప్ 2 డయాబెటిక్ డయాబెటిక్’ లో బీటా కణాలు పూర్తిగా దెబ్బతిన్నదీ,లెనిదీ ఎలా తెలుస్తుంది? ఏ టెస్టులు చేయిన్చుకోవాలి?

వీరమాచనేని : ప్రోగ్రాం చేసేదాకా తెలియదు. ప్రోగ్రాం అయ్యాక కార్బ్ ఇస్తున్నపుడు తెలుస్తుంది. టైప్ 1 కి చేయించే టెస్టులు 2 చేయించాలి. పాంక్రియాస్ ఫంక్షనింగ్ టెస్ట్, ఇన్సులిన్ ప్రొడక్షన్ టెస్ట్ లు చేయించితే బీటాకణాలు పూర్తిగా దెబ్బతిన్నదీ… లేనిదీ…. తెలుస్తుంది. ఈ ప్రోగ్రాం లో టైప్ 2 నుండి టైప్ 1 కు కన్వర్ట్ అయినవారిలో 70 శాతం పాంక్రియాస్ రికవరీ అవుతున్నాయి. దీనికి నియమబద్ధంగా 7,8 నెలలు ప్రోగ్రాం చేయాల్సి ఉంటుంది. అప్పటికీ కాకపొతే టైప్ 1 గా కన్వర్ట్ అయినట్లు భావించాలి.

ప్రశ్న 60 : ఫ్యాట్ పరగడపుననే తీసుకోవాలా? ఒక లీటరు నీరు + నిమ్మకాయ రసం తీసుకున్నాక తీసుకోవాలా? నిమ్మరసం+నీరు తీసుకున్నాక ఎంత సమయం ఆగి ఫ్యాట్ తీసుకోవాలి?

వీరమాచనేని : కొబ్బరి నూనె అయితే 10 గ్రాముల చొప్పున విభజించి రోజు మొత్తంలో మీరు నియమించుకున్న కోటా పూర్తి చేయాలి. వేడి నీటితో లేదా గ్రీన్ టీ లాంటి వాటితో కలుపుకుని తీసుకోవడం మంచిది. మిగతా ఫ్యాట్ అయితే అన్నిసార్లు విభజన అవసరం ఉండదు. ఆహరం తీసుకున్నాక, లేదా నిమ్మరసం వంటివి తీసుకున్నాక ఫ్యాట్ తీసుకోవడానికి  గ్యాప్ అనేది మీ ఇష్టం. పరగడపుననే లేదా ఫలానా సమయంలోనే తీసుకోవాలని లేదు.

ప్రశ్న 61 : ఫ్యాట్ కు వాడే కొబ్బరి నూనెనే వంటకు వాడాలా? లేదా రోస్టెద్ వాడాలా?

వీరమాచనేని : ఫ్యాట్ కు వాడేదే వాడితే చాలు. రోస్తేడ్ కానీ… హాట్ ప్రెసుడ్ కానీ వాడకండి. ఎపుడైనా ఆయిల్స్ విషయంలో మీరు దగ్గరుండి ప్రకృతి సిద్ధమైన వాటితో గానుగ పట్టించుకునేదే మంచిది.

ప్రశ్న 62 : ఉదయాన్నే ఫ్యాట్ తీసుకున్నాక ఎంతసేపు ఆగి నట్స్  తీసుకోవాలి? నట్స్ ఏ సమయంలో తీసుకోవాలి? ఎన్ని తీసుకోవాలి?

వీరమాచనేని : ఫలానా సమయం అనే నిబంధన లేదు. ఏ సమయంలోనైనా తీసుకోండి. రోజు మొత్తంలో కోటా పూర్తి కావడమే నిబంధన. నట్స్ అనేవి తినేవాటిలో ఆప్షన్ కోటా మాత్రమే. తప్పనిసరిగా చేయాల్సిన 4 పిల్లర్స్ లోనివి కావు. ఫ్యాట్ తీసుకున్నాక ఇంతసేపు ఆగాలని లేదు. బాదం రాత్రి నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసి 10 లోపు తినండి. వాల్నట్ 10 నుండి 20 వరకు రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినండి. స్పాన్దిలైటిస్, కీళ్ళ నొప్పులు, నరాల సమస్యలు వంటివి ఉన్నవారికి వాల్నట్ అద్భుతంగా పని చేస్తుంది. అటువంటి వారు 20 దాకా తినండి. మిగతా వారు 10 తీసుకుంటే చాలు. వాల్నట్ అనేది ‘మదర్ ఆఫ్ ఆల్ నట్స్’ అని గుర్తుంచుకోండి. పిస్తా మాత్రం రోజుకు 10 గింజలు లోపు తీసుకోండి. 

ప్రశ్న 63 : గింజలు రోజులో ఎన్ని సార్లు తీసుకోవాలి? 3 రకాల గింజలు కలిపి తీసుకోవాలా? విడి విడిగా తీసుకోవాల్నా? వీటి వలన ఉపయోగం ఏమిటి? ఏ సమయంలో తీసుకోవాలి? నెయ్యితో వేయిన్చుకోవల్నా? విడిగా తినవచ్చా? ఉప్పు కలుపుకోవచ్చా?

వీరమాచనేని : గింజల వలన ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. మీరు ఎన్ని మీల్స్ చేస్తున్నారు అనేదానిని బట్టి ఇవి తీసుకోవడం చేయండి. 3 మీల్ అయితే 3 సార్లు….., 2 మీల్ అయితే 2 సార్లు అలా తినండి. ఒక్కొక్కటి 5 స్పూన్లు చొప్పున విడిగా లేదా కలిపి అయినా తీసుకోండి. నేతితో వేయించుకోవచ్చు. వేయించే సమయంలో ఉప్పు కలుపుకోవచ్చు. విడిగా మాత్రం కలపవద్దు. ఉప్పు ప్రాసెస్ గా కలవాలి తప్ప ఎపుడూ… ఎందులోనూ… విడిగా కలపవద్దు.

ప్రశ్న 64 : టొమాటోను ప్రతి రోజు తప్పనిసరిగా వాడాలా?
వీరమాచనేని : టొమాటో అనేది తప్పనిసరి కాదు. ఆప్షనల్ కోటాలోనిది. రోజుకు రుచికోసం కలుపుకునేందుకు ఒక్కటి మాత్రం వాడితే సరిపోతుంది. అంతకు మించి వాడవద్దు.
ప్రశ్న 65 : ఫ్యాట్ 70-100 గ్రా. ఎవరు, ఎన్ని రోజులు తీసుకోవాలి? 
వీరమాచనేని : ఫ్యాట్ 70-100 గ్రా. అనేది మీ శరీరం ఫ్రేమును బట్టి, ప్రోగ్రామ్లో ఆకలి,నీరసం ను బట్టి వాడాలి. చిన్న ఫ్రేము వారైతే తక్కువగా, పెద్ద ఫ్రేము వారైతే ఎక్కువ వాడాలి. ఆకలి, నీరసం లేదు అనుకున్నవారు ఫ్యాట్ కోటాను 10 రోజులు తరువాత 10 లేదా 20గ్రా. తగ్గించుకోండి. ఆకలి, నీరసం ఉంటూ బరువు తక్కువ ఉన్నవారు ఫ్యాట్ కోటాను పెంచాలి. ఆకలి, నీరసంలను బట్టి 150 గ్రా.ల వరకూ వాడాల్సి రావచ్చు. వివిధ వ్యక్తులను బట్టి వారి ఆకలి, నీరసం, బరువులను బట్టి 10రోజుల ప్రోగ్రాం చేసిన తరువాత ఎవరికి వారే తగ్గిమ్చడం లేదా పెంచడం అనేది జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి.
ప్రశ్న 66 : లిక్విడ్ డైట్ చేసిన తరువాత బ్రేక్ చేసిన రోజుననే ఫ్యాట్ యధావిధిగా తీసుకుని నట్స్,కూర తీసుకుంటూ 1 మీల్ డైట్ కొనసాగించవచ్చా? 
వీరమాచనేని : చేయవచ్చు.
మరిన్ని సందేహాలకు సమాధానాలు తదుపరి పోస్టులో ……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here