ఎటువంటి కొబ్బరినూనెను వాడాలి?  సందేహాలు – సమాధానాలు (పార్ట్-5)

0
97

వీరమాచనేని రామకృష్ణారావు ఆహార విధానం పై మీ సందేహాలను మాకు వ్రాయండి. మీ ప్రశ్నలకు వీరమాచనేని రామకృష్ణ స్వయంగా సమాధానాలు ఇస్తారు. మీ ప్రశ్నలను క్రింద సూచించిన మెయిల్ ఐడీ లకు పంపించండి. ఇంతక్రితం సందేహాలు – సమాధానాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఇది కేవలం తెలుగు వారికోసం మాత్రమే కనుక  దయచేసి మీ ప్రశ్నలను తెలుగులో మాత్రమే పంపించాలని విజ్ఞప్తి.

1) janavijayam@gmail.com  2)  kondalarao.palla@gmail.com 

సందేహాలు – సమాధానాలు (పార్ట్ – 5)
             వీరమాచనేని రామకృష్ణారావు తో “జనవిజయం” ఎడిటర్ పల్లా కొండలరావు
ప్రశ్న 46: ఈ విధానాన్ని ప్రారంభించే ముందు ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వీరమాచనేని : మంచి ప్రామాణికతలు పాటించే లేబరేటరీలో అన్నిరకాల పరీక్షలు చేయించుకుని రిపోర్టులు  దగ్గరపెట్టుకోవాలి.  ఈ విధానానికి సంబంధించిన పదార్థాలన్నింటినీ ప్రోగ్రాము మొదుపెట్టే ముందే  సమకూర్చుకోవాలి.  పూర్తి నిడివి కలిగిన వీడియోలను ఎక్కువగా చూడాలి.  వీడియోను మొబైల్‌లో కాకుండా పెద్దస్క్రీన్‌పై కుటుంబం అంతా కలిసి చూడాలి.  ముఖ్యమైన అంశాలను నోట్‌ చేసుకోవాలి.  నేను స్వయంగా చెప్పే మీటింగుకు హాజరై విషయాన్ని దగ్గరుండి విని, ముఖ్యాంశాలను నోట్‌ చేసుకోవడం మంచిది.  టైప్‌`2 డయాబెటిస్‌ మినహా మిగతా ఏ వ్యాధికైనా వైద్యుల  సలహా మేరకు మందులు వాడుతూ నియమితకాలం పాటు ఈ విధానం అనుసరించాలి.  ‘టైప్‌`  డయాబెటిస్‌ వారు మాత్రం వెంటనే మందులు ఆపివేయాలి.  టైప్‌`2 డయాబెటిస్‌ వారు చేస్తే నా విధానం ఆచరించండి, లేదా డాక్టర్ల సలహా పాటించండి.  ఎట్టి పరిస్థితులలోనూ రెండింటినీ కలగాబులగం చేయవద్దు.  అలాచేస్తే ప్రాణానికే ప్రమాదం. 

ప్రశ్న 47: వైద్యానికి సంబంధించిన అంశాలపై సభలుపెట్టి ఆరోగ్యం గురించి, జబ్బు గురించి చెప్పే అధికారం మీకెవరిచ్చారు?

వీరమాచనేని : ప్రజలే ఇచ్చారు. నేను వైద్యం చేయడంలేదు. మందులు ఇవ్వడంలేదు.  ప్రకృతినుండి లభించే ఆహారపదార్థాలను వాటి ధర్మాల ఆధారంగా ఒక ప్రోగ్రాంను డిజైన్‌చేసి జీవనశైలిలో విచ్చలవిడితనాన్ని తగ్గించేలా మంచి అలవాట్లను నేర్పుతున్నాను. నేను చెప్పేదానిలో ఏ ప్రమాదమూ, అశాస్త్రీయత లేదు. మంచి చెప్పడానికి అధికారం అవసరం లేదు. నేను ప్రజలకు ఆహార నియమాలను వివరిస్తున్నాను. అందులో మంచి వుందా? లేదా? అనేది పరీక్షించుకుని వారే పాటిస్తున్నారు. చుట్టుపక్కల వారి ఫలితాలను చూసి మిగతావారు ప్రారంభిస్తున్నారు. నేను నా దగ్గర ఏ రహస్యమూ దాచుకోవడం లేదు. ఒక్క రూపాయికూడా ఎవరివద్ద నుండీ ఆశించడం లేదు. మనకు తెలిసిన విజ్ఞానాన్ని సమాజానికి చెప్పకపోతే సమాజానికి ద్రోహం చేసినట్లే అనేది నా భావన. విజ్ఞానం ఇంటర్నెట్‌లోనో, పెద్దపెద్ద గ్రంథాలలోనో నిక్షిప్తమై వుండడం కంటే, సామాన్యులతో సహా ప్రజందరికీ అందుబాటులోకి వస్తేనే వాటివ్ల ఫలితాలు  అందరికీ లభిస్తాయి. నా పేరుతో ఫేస్‌బుక్‌ ఎకౌంటు కానీ, ట్విటర్‌ ఎకౌంట్‌ కానీ లేదు. నేను డైరెక్టుగా లేదా ఇండైరెక్టుగా ఒక్క రూపాయి ఆశించడం లేదు. ఒక సామాజిక బాధ్యతతో ఈ ప్రోగ్రామును ప్రజలోకి తీసుకుపోతున్నాను తప్ప ఆర్ధికంగా లాభపడే ఆలోచన లేదు. ఎప్పటికీ ఉండదు కూడా. పరోక్షంగా నా వీడియోలను యూ ట్యూబ్‌ చానల్‌ క్రియేట్‌ చేసుకున్నా నాకు లాభం వచ్చే వీలుంది. కానీ నేనలాంటివి కూడా చేయడం లేదు. ప్రజలు ఆలోచిస్తున్నారు. క్రమంగా డాక్టర్లు దీనికి సంపూర్ణంగా మద్ధతిస్తూ ముందుకొస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగాలి. అందరం కలసి డయాబెటిస్‌ లేని ప్రపంచాన్ని సృష్టించుకుందాం. వ్యక్తలు ఈగోలు, అనవసరమైన గందరగోళాలు వద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరో విషయం ఇక్కడ చెప్పదలచుకున్నాను. నా పేరుతో ఫేస్‌బుక్‌ ఎకౌంటు ఉందనీ, అందులో పొలిటికల్‌ పోస్టులూ  ఉంచుతున్నారనీ నా దృష్టికి వచ్చింది. వాట్సప్‌ తప్ప నాకు ఏ సోషల్‌ మీడియా ఎకౌంటూ లేదు. వాటిని నమ్మవద్దని ‘జనవిజయం’ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. నా కంట్రోల్‌ ఉంటుంది కనుక నేను వాట్సప్‌ వాడుతున్నాను. నాకు ఫేస్‌బుక్‌, ట్విటర్‌ లాంటి గురించి అసలేమీ తెలియదు. ఇంతవరకు వాడలేదు. ఒకవేళ అవసరమై ఫేస్‌బుక్‌ లాంటి మాధ్యమాలలో ఖాతా ప్రారంబిస్తే బహిరంగంగానే ప్రకటిస్తాను. ఈలోగా నా పేరుతో వచ్చే సోషల్‌మీడియా కథనాలను దయచేసి నమ్మకండి. వీటిపట్ల అప్రమత్తంగా ఉండండి.

ప్రశ్న 48: డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా ఈ విధానాన్ని ఎవరికివారు పాటిస్తే నష్టం జరగదా? మీరెందుకు డాక్టర్ల సమక్షంలో చేయండని చెప్పరు?

వీరమాచనేని : ఎక్కువమంది డాక్టర్లు ఈ విధానాన్ని ఆమోదించారు. ఆచరించి సత్ఫలితాలను పొందారు. అయితే వారికున్న గైడ్‌లైన్స్‌ మూలంగా వారి పరిధుల మేరకు వారు చెప్తారు. కొందరు ఇగో లేదా ఇతర కారణాలతో దీనిని వ్యతిరేకిస్తారు. డాక్టర్లు మందులు బదులుగా ఆహార పదార్థాలను ప్రిస్క్రిప్షన్‌గా రాసే మంచి రోజులు రావాలి. ప్రజలు అనారోగ్యంకు సరైన చికిత్స లభిస్తుందనుకుంటే డాక్టరు దగ్గరకే వెళతారు తప్ప రామకృష్ణ దగ్గరకు కాదు. కనుక డాక్టర్లే ఇది చేయాలని నా కోరిక. డాక్టర్లకు వుండే గైడ్‌లైన్స్‌ కారణంగా వారికీ, వారి కుటుంబాలకు కూడా నష్టం చేసుకుంటున్న సందర్భాలు అనేకం ఉంటున్నాయి. ఈ పరిస్థితి మారాలన్నదే నా తాపత్రయం. ముఖ్యంగా డాక్టర్లు వైద్యవిజ్ఞానం పట్ల తాజా సమాచారాన్ని ఎప్పటికపుడు అప్‌డేట్‌ కావడం మంచిది. ఇప్పటికీ కోడిగుడ్డు ఎల్లో ప్రమాదం, దానివలన గుండెజబ్బులకు అవకాశం ఉందని చెప్తున్న డాక్టర్లు ఉన్నారు. 

ప్రశ్న 49: ఇన్నాళ్ళూ కొవ్వు పదార్థాలు తినవద్దని డాక్టర్లు కావాలని చెప్పారంటారా?

వీరమాచనేని : కావాలని చెప్పలేదు. వాళ్ళకున్న మెడికల్‌ గైడ్‌లైన్స్‌ మూలంగా చెప్పారు. ఇతరులకు చెప్పడమే కాకుండా వారు, వారి కుటుంబ సభ్యులను కూడా కొవ్వుకు దూరంచేసి అనేక రోగాలు తెచ్చుకున్నారు.  ఇప్పుడు ఆ గైడ్‌లైన్స్‌ సాధికారికంగానే మారాయి. ఇందులో డాక్టర్లను తప్పుపట్టేదేమీలేదు. అయితే గైడ్‌లైన్స్‌ మారాక కూడా సబ్జెక్టును అప్‌డేట్‌ చేసుకోకుండా మూర్ఖంగా వాదించే వైద్యులు మాత్రం సమాజానికి ద్రోహం చేస్తున్నట్లే లెక్క. 

ప్రశ్న 50: సమాజాన్ని కొవ్వుకు దూరం చేసిందెవరు? దీని వెనుక మెడికల్‌ మాఫియా వుందనుకోవచ్చా?

వీరమాచనేని : మెడికల్‌ మాఫియా లాంటి పెద్ద పదాలు వాడే స్థాయి నాకు లేదు. కానీ ప్రజలలో ఆ అభిప్రాయం ఉంది. వాటిగురించి నాకు లోతైన విషయాలు తెలియదు. సమాజంలో ఫ్యాట్‌ తిన్నంతకాలం ప్రజల ఆరోగ్యం బావుంది.  నెయ్యి, మీగడ, వెన్న, మాంసం, కోడిగుడ్డలోని పచ్చసొనతో సహా రుచికరమైన ఆహారం తీసుకున్న మన పూర్వీకులు ఎంతో శక్తివంతంగానూ, ఆరోగ్యంగానూ వున్నారు. ఎప్పుడైతే కొవ్వుకు సమాజాన్ని దూరం చేశారో అప్పుడే భయంకరమైన వ్యాధులు మొదలయ్యాయి. 70వ దశకంలో ఎటువంటి ట్రైల్స్‌ లేకుండా, ఏ ఒక్కరిమీదా ప్రయోగాలు చేయకుండా, కేవలం ఊహాజనితంగా మాత్రమే ఫ్యాట్‌వల్ల ప్రమాదమని మెడికల్‌ గైడ్‌లైన్స్‌ సృష్టించారు. 1970లో అమెరికాలో అత్యధికంగా గుండెపోట్లు రావడంతో దీనికి కారణం కొవ్వు అనే అపోహతో ఇలా చేశారు. దీని వెనుక మెడికల్‌ కంపెనీల  స్వలాభాపేక్ష వుంది. లక్షలకోట్ల డ్రగ్‌ మాఫియా సాగింది. అనవసరంగా ప్రజల ఆరోగ్యంతో, అవయవాలతో ఇన్నాళ్ళూ మెడికల్‌ మాఫియా ఆడుకుంది.  సమాజానికి అత్యంత ద్రోహం చేసింది. ఇప్పటికైనా ఈ ద్రోహాన్ని గుర్తించి, తిరిగి మంచి ఆహారంవైపు సమాజాన్ని మళ్ళించాలి.  ప్రజలను ఆ దిశగా చైతన్యపరచాలి.  ఇది ప్రతి ఒక్కరి బాధ్యత.  మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండడం ప్రతి పౌరుడి హక్కుగా మారాలి. 

ప్రశ్న 51:  గుండె జబ్బులకు కారణాలు ఏమిటి? 

వీరమాచనేని : షుగర్‌, బి.పి, స్థూలకాయమ ప్రధాన కారణం. ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ వల్ల ఇలాంటివి ముదురుతున్నాయి. వీటితోపాటు పొగత్రాగడం, మద్యం సేవించడం, ఇతరత్రా వ్యసనాలు కూడా కారణం. మంచి జీవనశైలిని అవరచుకుంటే చాలావరకు ప్రమాదకర రోగాలకు దూరంగా ఉండవచ్చు.

ప్రశ్న 52: ఎటువంటి కొబ్బరినూనెను వాడాలి? 

వీరమాచనేని : కురిడీలు తెప్పించుకుని బాగా ఎండబెట్టి దగ్గరుండి గానుగలో పట్టించిన కొబ్బరినూనె మాత్రమే మంచిది. శుభ్రంగా, తేటగా కనిపించాలని దీనిలో ఎట్టిపరిస్థితిలోనూ ఏదీ కలుపకూడదు. కురిడీలకు ఉండే బూజును తొలగించుకోవాలి.

ప్రశ్న 53: అనుభవానికి మించిన శాస్త్రీయత లేదంటారు కదా? మరి అందరికీ ఒకే అనుభవం రాదు కదా? 

వీరమాచనేని : ఈ విధానంలో మంచి కామన్‌. ఎక్కువ మంచి, తక్కువ మంచి ఉంటాయి. చెడు మాత్రం ఉండదు.

ప్రశ్న 54: డయాబెటిస్‌ ఉన్నదనడానికి సరైన కొలమానం ఏమిటి? ఏ టెస్టు చేయించాలి? 

వీరమాచనేని : దీనిమీద ప్రపంచంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఒకపుడు 250 దాటితేనే షుగరు ఉన్నట్టు భావించేవారు. ఇప్పటికీ అమెరికాలో కొలతకూ, ఇండియాలో కొలతకూ తేడా ఉంది. అమెరికాలో కనీస హెచ్‌.బి.ఎ1సి నియమానికీ, ఇండియాలో హెచ్‌.బి.ఎ1.సి నియమానికీ తేడాలున్నాయి. షుగరు ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి హెచ్‌.బి.ఎ1సి రక్తపరీక్ష ద్వారా షుగరు కొలతను సరిగా నిర్ధారించుకోవచ్చు.

ప్రశ్న 55: స్థూలకాయం ఉన్నదని ఎలా నిర్ధారించుకోవాలి? 

వీరమాచనేని : మనిషి ఆకారాన్ని బట్టి నిర్ధారించుకోవచ్చు. నిటారుగా నిలబడి మెడ క్రిందికి వంచి చూస్తే పొట్ట అడ్డుపడకుండా కాలివేళ్ళు కనబడితే స్థూలకాయం లేనట్లు. కనబడకుంటే ఉన్నట్లు భావించాలి.

ప్రశ్న 56: గుండెపోటు వచ్చినవారు, స్టంటు వేసినవారు ఈ విధానం పాటించవచ్చా?

వీరమాచనేని : వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతూ పాటించవచ్చు. వారికి ఈ ప్రోగ్రాం వరం లాంటిది. అలాంటి రోగులకు డాక్టర్లు కూడా ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. 

మరిన్ని సందేహాలకు సమాధానాలు తదుపరి పోస్టులో …….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here