VRK Diet సందేహాలు – సమాధానాలు (2)

0
241

వీరమాచనేని రామకృష్ణారావు ఆహార విధానం అనుసరిస్తున్నవారు, ప్రారంభించాలనుకుంటున్నవారు, ఈ విధానం తెలుసుకోవాలనుకుంటున్నవారు మీ సందేహాలను మాకు వ్రాయండి. మీ ప్రశ్నలకు వీరమాచనేని రామకృష్ణ స్వయంగా సమాధానాలు ఇస్తారు. ఈ విధానం ఒక్కరోజులోనో, కొంత కాలంలోనో పూర్తయ్యేది కాదు. చాలా ప్రశ్నలు వస్తున్నందున వరుస క్రమంలో రామకృష్ణ గారి సమయానుకూలతని బట్టి, వీలయినంత త్వరగా సమాధానం అందించేందుకు కృషి చేస్తాము. దీనిని గమనంలోకి తీసుకుని అందరూ సహకరించాలని విజ్ఞప్తి. మీ ప్రశ్నలను క్రింద సూచించిన మెయిల్ ఐడీ లకు పంపించండి.  ఇంతక్రితం ‘సందేహాలు-సమాధానాలు’ కోసం ఇక్కడ నొక్కండి.

1) janavijayam@gmail.com  2)  kondalarao.palla@gmail.com 
         వీరమాచనేని రామకృష్ణారావు తో “జనవిజయం” ఎడిటర్ పల్లా కొండలరావు
సందేహాలు – సమాధానాలు
ప్రశ్న 16: మోకాళ్ళ నొప్పులున్నవారు వీరమాచనేని ఆహార విధానంను అనుసరించాంటే మందులు ఏవి వాడాలి? ప్రత్యేక ఆహారం ఏదైనా సూచిస్తారా?
వీరమాచనేని : వాల్‌నట్స్‌ ఎక్కువగా తీసుకోండి. ప్రతిరోజూ నానబెట్టిన వాల్‌నట్స్‌ 15కు పైగా తీసుకోండి. ఈ విధానంలో సూచించిన అన్ని గింజలు తీసుకోండి. ఫ్యాట్‌కు కొబ్బరినూనెను తప్పనిసరిగా వాడండి. నెప్పి తీవ్రతను బట్టి అల్లోపతి వైద్యులు సూచించే మందులనే తగ్గవరకూ వాడండి.
ప్రశ్న 17 : వీరమాచనేని ఆహార విధానంను ఎవరైనా వైద్యులు కావాలని వ్యతిరేకిస్తే ఏమి చేయాలి?
వీరమాచనేని : సహేతుకమైన కారణం లేకుండా వ్యతిరేకించడమే ఎజెండాగా పనిచేసే డాక్టర్లను మార్చేయండి. వారివద్దకు మీకు తెలిసినవారిని కూడా వెళ్ళవద్దని ప్రచారం చేయండి. ఈ విధానంపై స్పష్టమైన అవగాహన ఉన్న వైద్యుల వివరాలు కనుక్కుని వారిని సంప్రదించడం చేయండి. 
ప్రశ్న 18 : ప్రతిరోజూ నాన్‌వెజిటేరియన్‌ ఫుడ్‌ తీసుకుంటే ఏదైనా నష్టం ఉందా? 
వీరమాచనేని : ఎటువంటి నష్టం లేదు. పైగా మంచిది కూడా. మాంసాహారం మంచి ప్రోటీన్‌ ఫుడ్‌. అయితే విచ్చలవిడితనం లేకుండా పరిమితిగా 250 గ్రా.కు మించకుండా తినండి. 
ప్రశ్న 19 : కేవలం మైగ్రేన్‌తో బాధపడేవారు ఈ ఆహార విధానంను ఎన్ని రోజులు అనుసరించాలి?
వీరమాచనేని : మైగ్రేన్‌ సమస్య వెంటనే తొలగిపోతుంది. కేవలం ఈ సమస్య ఉన్నవారైతే 10 నుండి 15 రోజుల లోపు చేస్తే సరిపోతుంది.
ప్రశ్న 20 : థైరాయిడ్‌ సమస్య ఉన్నవాళ్ళు వీరమాచనేని ఆహార విధానంను వాడాలనుకుంటే ఎన్ని రోజులు ఏ నిబంధనలు పాటిస్తూ చేయాలి? 
వీరమాచనేని : ఎప్పటికపుడు పరీక్షించుకుంటూ వైద్యుని సలహామేరకు మందులు వాడుకుంటూ చేస్తే 15 నుండి 3 నెలల పాటు ఈ విధానం చేయాల్సి ఉంటుంది. ఎవరికైనా ప్రోగ్రాం ఒకటే. థైరాయిడ్‌ సమస్య ఉన్నవారిలో ఇప్పటివరకూ వచ్చిన ఫలితాలలో 90 శాతం వరకూ తగ్గుతున్నది. థైరాయిడ్‌ గ్లాండ్‌ దెబ్బతిన్నవారు తప్ప మిగతా వారికి తగ్గిపోతున్నది. 
ప్రశ్న 21 : డయాబెటిస్‌ ఉన్నవారు ఈ ఆహార విధానంను 3 నెలల కంటే ఎక్కువ కాలం చేస్తే ఏమైనా ప్రమాదమా?
వీరమాచనేని :  ఏ ప్రమాదమూ లేదు. నిరభ్యంతరంగా, నిస్సందేహంగా ఎన్నిరోజులైనా చేయవచ్చు.
ప్రశ్న 22 : మీ ఆహార విధానంను కొంతకాలం కాకుండా జీవితాంతం పాటించాలనుకుంటున్నాము. అలా చేయవచ్చా? ఏమైనా ప్రమాదమా?
వీరమాచనేని : ఏ ప్రమాదమూ లేదు. మనం రుచిగా తినే హక్కును ఎందుకు పోగొట్టుకోవాలి? అన్నీ పరిమితంగా తినండి. ‘విచ్చలవిడితనం’ ను సమాజం నుండి పారద్రోలండి. మీ శరీరంను బట్టి, మీ శ్రమను బట్టి సమతుల్య ఆహారం తీసుకోండి. ‘మాకు ఈ విధానం బాగుంది…. చేయగలం’ అనుకుంటే జీవితకాలం కొనసాగించవచ్చు. లేదూ…. రోగాలు పోయాక మానేస్తాం అనుకుంటే మానేయండి. విచ్చలవిడితనం వదిలేయకపోతే మళ్ళీ రోగాలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో స్విచ్‌ మీ చేతిలోనే ఉంది. మళ్ళీ మన విధానం ఆచరించండి. కానీ వీలైనంతమేరకు విచ్చలవిడితనానికి స్వస్తి పలికి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి. 
ప్రశ్న 23: ఈ విధానం నియమిత కాలం అనుసరించాక ఫ్యాట్‌, ప్రోటీన్‌, కార్బ్‌ లను ఏ నిష్పత్తిలో తీసుకోవాలి? 
వీరమాచనేని : కొలతలేమీ లేవు. అన్నిరకాలు ఉండేలా చూసుకోండి. నమిలి తినేది 3 సార్లుకు మించి తీసుకోవద్దు. ఆకలి వేసినపుడు మాత్రమే తినడంఆకలి తీరేదాక మాత్రమే తినడం, మళ్ళీ ఆకలి వేసేవరకూ తినకుండడం, మళ్ళీ ఆకలి తీరేదాక మాత్రమే తినడం అనే విధానం పాటించండి. రాత్రిపూట సాయంత్రం 7 గం.ల లోపు తినండి. ఉదయం 8 గం.ల తరువాత మాత్రమే తినండి. ఈ నియమం ఉద్దేశం రాత్రి భోజనం తరువాత ఉదయం ఫాస్టింగ్‌ ని బ్రేక్‌ చేయడానికి మధ్య 13గం. విరామం తప్పనిసరిగా ఉండేలా చూడాలి. జీర్ణాశయానికి విశ్రాంతి ఇస్తే శరీరం తనంత తాను చాలా వరకు క్లీనింగ్ , రిపేరింగ్ చేసుకుంటుంది.
ప్రశ్న 24 : ‘సమతుల ఆహారం’ అంటే సరైన నిర్వచనం ఏమిటి? 
వీరమాచనేని : ఇది మనిషికీ, మనిషికీ వారు చేసే శారీరక శ్రమ, ఇతర అంశాల ఆధారంగా మారుతుంది. ప్రోటీన్‌, ఫ్యాట్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. వెజిటేరియన్‌లో తప్పకుండా అన్ని రకాల ఆకుకూరలలో ఎదో ఒకటి ప్రతిరోజూ తీసుకోవాలి. బ్రౌన్‌ రైస్‌ ఒక వంతైతే, కూర రెండు వంతులు కలుపుకోవాలి. మనం చెప్పే ‘తినేవిధానం’ అమలులో ఉంచాలి. ఎట్టి పరిస్థితిలోనూ విచ్చలవిడితనాన్ని దరిచేరనీయవద్దు. అన్ని రకాల సీజనల్‌ ఫ్రూట్స్‌ సహజ సిద్ధంగా పండించినవి తీసుకోవాలి. ఆమేరకు సమాజంలో చైతన్యం వస్తే పంటల విధానంలోనూ మార్పు వచ్చితీరుతుంది. కూరగాయలు, ఆకుకూరలను వీలైనవంతవరకూ ఇంట్లోనే పెంచుకోండి. పురుగుమందుల వాడకం మానేయాలి. వాడినవైతే యథాతథంగా తినొద్దు. ఉప్పు నీళ్ళలో నానబెట్టి కడిగి వాడాలి.
ప్రశ్న 25 : ఆహారంలో ఉండే 7 రకాల పోషక పదార్ధాలు (కార్బోహైడ్రేట్స్‌, ప్రోటీన్స్‌, విటమిన్స్‌, ఫ్యాట్‌, మినరల్స్‌, పీచుపదార్ధం) ఏయే నిష్పత్తిలో తీసుకోవాలి? 
వీరమాచనేని : 7 రకాల పోషక విలువలు సమంగా ఉండేలా లెక్కేసుకుని తినలేము. ఒక పద్ధతిని అవాటు చేసుకోవడం మంచిది. రోజూ ప్రతి ఒక్కరూ కనీసం ఒక గ్రుడ్డు, ఒక ఆకుకూర, నట్స్‌ ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది.
మరిన్ని సందేహాలకు సమాధానాలు తదుపరి పోస్టులో …….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here