త్రివిక్రం మెచ్చిన పుస్తకాలివే..మీరూ చదవండి!

0
581

అధ్యయనం ఒక మంచి అలవాటు. మంచి పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా చాలా మంచి విషయాలు తెలుస్తాయి. ఆయా రచయితల అభిప్రాయాలతో పాటూ ఆయా కాలమాన పరిస్థితులలో ప్రజల జీవన విధానం, వివిధ సమస్యలను వారి ఎదుర్కొని పరిష్కరించిన విధానం తెలుస్తుంది. చారిత్రాత్మక నవలలతో పాటూ తెలుగులో అనేక మంచి నవలలు సమాజంపై ప్రభావం చూపినవి వున్నాయి. ప్రస్తుత డిజిటల్ యుగంలో అధ్యయనం అనే మంచి అలవాటుకు దూరం అవుతున్నాం. సాంకేతికంగా ఎన్ని మార్పులు వచ్చినా పుస్తకాలకు, పుస్తక రచనకు, వాటిని అధ్యయనం చేయడంలో కలిగే సంతృప్తికి ప్రత్యామ్నాయాన్ని చూడలేం.

నేటి తరం ప్రేక్షకులను తన మాటలతో మంత్ర ముగ్దులను చేస్తూ మంచి దర్శకుడిగా పేరుగాంచిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి అధ్యయనశీలి. ఇటీవలె జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయనకు నచ్చిన 5 నవలలను గురించి వివరించారు. తన ఉపన్యాసాలలో అధ్యయనం చేయాలంటూ నేటి యువతకు సందేశమిస్తుంటారు. ఈ విషయంలో త్రివిక్రమ్ ను అభినందించాల్సిందే. త్రివిక్రం తెలియజేసిన ఆ నవలల వివరాలను ఇదే పేజీలో చివర ఆన్లైన్లో కొనుగోలు పొందుపరుస్తున్నాం. 

గతంలో అనేక నవలలను సినిమాలుగా రూపొందించేవారు. ప్రేక్షకులు వాటిని ఆదరించేవారు. ఇప్పుడు ఆ ఒరవడి తగ్గుముఖం పట్టింది. నేటి దర్శకులలో త్రివిక్రమం మాత్రం నవలలతో స్ఫూర్తిని పొంది సినిమాలలో ఆయా పాత్రలను రూపొందించడం జరుగుతోంది. ప్రేక్షకులపై అమితంగా ప్రభావం చూపే సినిమా మాధ్యమం ద్వారా రచనలలోని మంచి అంశాలను, పాత్రలను తెరకెక్కించడం వల్ల సమాజానికి మంచే జరుగుతుంది. గతంలో S/o సత్యమూర్తి విజయవేడుకలో త్రివిక్రం మాట్లాడుతూ ‘అమరావతి కథలు’ అనే పుస్తకం గురించి ప్రస్తావించడం ద్వారా అధ్యయనం ద్వారా తనకు గల మక్కువను వెల్లడించారు. అమరావతి కథలు పుస్తకాన్ని అందరూ చదవాలని సూచించారు. అతడు చిత్రంలో హీరో ‘పార్థు’ పేరు కూడా యద్దనపుడి సులోచనారాణి గారి ‘పార్థు’ క్యారెక్టర్ ద్వారా ఇన్స్పైర్ అయి పెట్టిందే. ‘అ ఆ’ చిత్రం కూడా యద్దనపుడి సులోచనారాణి గారి ‘మీనా’ నవల సారాంశమే.

త్రివిక్రం మెచ్చిన పుస్తకాలివే:

1. వేయి పడగలు – విశ్వనాథ సత్యనారాయణ

Buy Online – Amazon | Telugu Books | Anand Books

ఇరవై ముద్రణలు పొందిన అద్భుతనవల, విశ్వనాథ సత్యనారాయణ

వేయిపడగలుఒక అద్భుత సృష్టి. భారతీయ భాషల్లోనే కాదు, ప్రపంచభాషల్లోనూ ఇంకెక్కడా ఇట్లాంటి నవల వున్నట్టు చూడము. ‘వేయిపడగలుకేవలం 29 రోజుల్లోనే వ్రాయబడిన నవల. ఎనిమిదివందలకిపైగా పుటల్లో పరచుకున్న కథకు భారతీయ ధర్మమూ దాని హ్రాసమూ ఇతివృత్తం. ఇది ప్రధానంగా ప్రతీకాత్మక నవల వేయిపడగల పాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నదీ కలలోన రాజునుఅన్న పాటతో మొదలవుతుంది వేయిపడగలు. కావ్యోపక్రమంలోనే కావ్యతత్త్వాన్ని సూచించే శిల్ప సంప్రదాయాన్నిట్లా పాటించారు విశ్వనాథ. వేయిపడగలపాము కుండలినీ సాధనకు ప్రతీక. ఆదిశేషునికి కూడా వేయి పడగలుంటాయి.

ఇందులో అరుంధతీ ధర్మారావులు నాయికానాయకులు. ‘వేయిపడగలులోని పలు పాత్రలు మానుష ప్రపంచాన్ని దాటి పోతాయి. అక్ష్మణస్వామి (ఏనుగు), పసిరిక వంటి పాత్రలు దీనికి ఉదాహరణలు. ఇక ధర్మారావు ధర్మం రూపుకట్టిన పాత్ర. గోపన్న కతడు సాక్షాత్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అపరావతారం.

కథాస్థలమైన సుబ్బన్నపేట ఓ గ్రామం. అది కాలక్రమంలో పాశ్చాత్యపుపెను ప్రభావాలతో ఆధునిక నాగరకతా పోకడలు పోయి, ఎట్లా పలుదుష్పరిణామాలకు లోనైందోనన్నది వేయిపడగలుఇతివృత్తం. సుబ్బన్నపేట యవద్దేశానికీ లక్ష్యభూతమైన గ్రామం. అది సుబ్రహ్మణ్య శబ్దానికి వికృతి. సుబ్రహ్మణ్యేశ్వరుడు వేయిపడగల స్వామి. వేయిముఖాలైన ధర్మానికి చిహ్నం. ”వేయిముఖాలుగా ధర్మం పరిపాలింపబడ్డ యా దేశమే సుబ్బన్నపేటగా చెప్పబడింది. అంతేగాని, యిది ఒక ఊరుకాదు. ఇది ఒక జమీందారీ కాదు …..” అని విశ్వనాథవారే ఒక రేడియో ప్రసంగంలో వివరించారు (జాగృతి 18-3-1955)

ఔను, నీవు మిగిలితివి, ఇది నా జాతి శక్తి, నా యదృష్టముఅంటుంది ధర్మారావు పాత్ర నవల చివరలో. సర్వధర్మాలూ నశించినప్పటికీ భారతదేశాన దాంపత్య ధర్మం ఒకటి మిగిలిందన్నది దాని అంతరార్ధం. రామేశ్వర శాస్త్రి, రంగాజమ్మ, మంగమ్మ, రంగారావు, హరప్ప, రుక్మిణమ్మారావు, కేశవరావు, దేవదాసు, పసిరిక, గణాచారి….. ఇట్లా ఎన్నో పాత్రలు ఆయా వ్యవస్థలకూ ధోరణులకు చిహ్నాలు; ప్రతీకలు.

2. చివరకు మిగిలేది – బుచ్చిబాబు

Buy Online – Amazon | Telugu Books | Anand Books

పురుష స్వామ్యసామాజిక భావజాలం అది సృష్టించిన పాత్రలు వీటి ప్రవర్తన ఈ నవలలో బొమ్మకడ్తుంది. ప్రపంచంలోని వ్యక్తులే సాహిత్యంలో పాత్రలౌతారు. అలాగే బుచ్చిబాబు ఈ నవలలో సృష్టించిన పాత్రలు; ఆ కాలంలో తెలుగుదేశంలోని ఆధునిక సాహిత్య సామాజిక తాత్విక ధోరణుల ప్రతిబింబాలనిపిస్తాయి. రాధాకృష్ణన్‌ రస్సెల్‌ జిడ్డు కృష్ణమూర్తుల సమాహార తాత్త్వికతే బుచ్చిబాబు దార్శనికత్వం అనిపిస్తుంది. ఆధునిక తెలుగు నవలల్లో మంచి వేవి? అని ఏ సాహిత్య విద్యార్థిని ప్రశ్నించినా ముందుగా చెప్పేదీ; తెలుగు కల్పనా సాహిత్యంలో చివరికంటా మిగిలేది ఈ చివరకు మిగిలేది”.

3. మైనా

Buy Online – Anand Books

పంజరంలో మైనగోరు నిద్రలేవడంతోనే రామ రామఅంది. స్వేచ్ఛను సహృదయంతోనే పంజరంలో పెట్టి బంధించిన మానవుడు ఆవలించి లేచాడు. సాదరంగా ఓసారి దాన్ని పలకరించి అవతలకు వెళ్ళిపోయాడు.

సాయి యింకా నిద్ర లేవలేదు. కలలో రెక్కలగుర్రం మీద ఎక్కడికో యెగిరి పోతున్నాడు. మైనా రెండుసార్లు పేరెట్టి పిలిచింది. సాయి అన్నయ్యలేచి సాయిని లేపాడు. సాయి లేవకుండానే విసుక్కున్నాడు.

నీ మైనా పిలుస్తోందిరా. ఇంకా నిద్రేనా, లేఅంటూ ఒక్క కుదుపు కుదిపాడు. అయినా లేవలేదు. మైనా మరోసారి పిలిచింది.

సాయి వొళ్ళు విరుచుకుని, లేచి నిల్చుని పంజరం దగ్గరకు వచ్చాడు. మైనా ఒక్కసారి రెక్కల్ని టపటపా కొట్టుకుని ఆనందంగా తల ఊపింది. పంజరంలోంచి దాన్ని తీసి బుగ్గమీద పొడిపించుకొని, ముఖం కడుక్కుందామని దొడ్లోకి పరెగెత్తాడు.

మైనా మెల్లగా ఎగురుతూ వచ్చి నీళ్ళడేగిఇశా మీద వాలింది. వచ్చేప్పుడు సాయి పంజరం తలుపులు వేసిరాలేదు. ”పోనిలే ఇవ్వాళ నీకూ ఆగష్టు పదిహేను”’ అనుకున్నాడు అక్కడకొచ్చిన దాన్ని చూసి.

మైనా అరుస్తోంటే ఆలోచనల్ని తెంపుకొని అటు చూశాడు. ఎలా వచ్చిందో నల్లపిల్లి మైనాను నోట కరుచుకుని పారిపోతుంది. పళ్ళ సందుట్లో మైనా ప్రాణం గిజగిజలాడుతోంది.

సాయి పెద్దగా అరచుకొంటూ దాన్ని వెంబడించాడు. ఆ వెనకనే సాయి అన్నయ్యా, వాళ్ళమ్మా పరుగెత్తారు.

చేజిక్కిన ఆహారాన్ని అది సులభంగా వదిలేయ దలుచుకోలేదు. మూడు నాలుగు యిళ్ళు తిప్పింది. గోడలు దూకింది. చివరకు ఓ యింఇ అటకెక్కి కూర్చుంది.

సాయి నిచ్చెన తెచ్చి అటక ఎక్కాడుగాని అప్పటికే నీరసించిపోతున్న మైనా అరుపు ఆఖరిసారిగా వినిపించి ఆగిపోయింది.

సాయి కళ్లు నీళ్ళతో తడిసిపోయాయి.

ఆ రోజు స్కూలుకు వెళ్ళలేదు. ఇంట్లోనే కూర్చున్నాడు…..

4. కీర్తి కిరీటాలు

Buy Online – Amazon | Telugu Books | Anand Books

ఆ గదిలో అడుగుపెట్టగానే అలంకార శిభిటంగా కనిపిస్తున్న ఆ బహుమతులన్నీ సంగీతంలో ఆవిడా సంవత్సరాలుగా చేసిన కృషిని చూపిన ప్రజ్ఞాపాటవాలకి మెయిలు రాళ్ళని చెప్పవచ్చు.

కొటిమందిలో ఏ ఒక్కరికో , ఏ పూర్వ జన్మ పుణ్యం వల్లనో లభ్యమయ్యే అపురూపమైన గాత్రం ఆవిడకి భాగవత్ప్రసాదంగా లభించింది. అది యెనలేని కీర్తి ప్రతిష్ట లని సంపాదించి పెట్టింది. డబ్బు పేరు ఆవిడ కోరకుండానే కష్టపడకుండానే ఆవిడని వెతుక్కుంటూ వచ్చాయి.

ఆమె రాజ్యలక్ష్మి ఆమె సంగీత విద్య ఆమెకు కీర్తి కీరీటాలు పెట్టింది. అయితే ఇంద్ర ధనుస్సుకు మల్లె ఆమె అదృష్టం కూడా అలా మెరిసి ఇలా మాయమయింది . ఆమె వైవాహిక జీవితమంతా అస్తవ్యస్తం. రెండు పెళ్ళిళ్ళు ఆమెను చెప్పలేని ఒత్తిడిని లోను చేశాయి. మొదటి భరతో కాపురం వాళ్ళ తేజ పుట్టాడు. అయితే పొరపొచ్చాలు మూలంగా విడాకులు తీసుకోవలసి వచ్చింది. కొడుకును కోర్టు భర్త కె అప్పగించింది. తండ్రి పోయాడు. విడాకులు పొందిన భర్త పోయాడు.

తోడూ కోసం మరో పెళ్లి, విదేశీ ప్రయాణం. .. ప్రవాసంరెండో భర్తకి అదివరకే వున్నా కొడుకు కిషోర్ ను పెంచి పెద్ద చేసింది. కిషోర్ రాజ్యలక్ష్మి ణి ద్వేషించాడు. ఏమిటి ఆమె ముందున్న దారి ? కన్నకొడుకు కాకుండా పోయాడు. ఉన్న కొడుకు శత్రువులా చూస్తాడు. ఒక సంగీత కళాకారిణి జీవితంలోని అపస్వరాలని ఆర్ధంగా చిత్రించే నవల కీర్తి కీరీటాలు. దీనిని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి కూడా లభించింది.

5. కాలాతీత వ్యక్తులు

Buy Online – Amazon | Telugu Books | Anand Books

ఇందులోని ప్రధానపాత్రలు నాలుగు. ప్రకాశం, కళ్యాణి, క్రిష్ణమూర్తులతో పాటు ఇందిర. నిజానికి ఇందిరే ప్రధానపాత్ర. ఈ కథలోని వ్యక్తులందరూ ఆమెచుట్టూ తిరుగుతూ రకరకాలుగా ప్రభావితం చెందుతూ వుంటారు. ఆమెను అంగీకరించలేరు. వదలలేరు. ఆమెవల్ల పరిచయమయిన మొదటి పాత్ర ప్రకాశం.

ఎం.బి.బి.ఎస్. చదివే ప్రకాశాన్ని అందరూ మెత్తని వాడంటారు. అసమర్థుడని కూడా కొందరనేవారు. సాటి విద్యార్థులతన్ని చూసి వట్టి చవటవురాఅని తేల్చి చెప్పేవారు. “బొత్తిగా చేవలేని వాడివి. ఎలా బతుకుతావో కానీఅని నిట్టూర్చేది వాళ్ళమ్మ.

చిన్నతనం నుంచీ ఇల్లు కదిలి ఎక్కడికీ వెళ్ళేదాన్ని కాదు. నలుగురితో కలిసి ఆడుకోవడం కూడా తెలీదుకనీసం మా నాన్నైనా నలుగురితో కలిసిమెలిసి వుండగలిగే మనిషైతే నేనిలా తయారవకపోదు నేమో! ఇవీ కళ్యాణి పెరిగిన కుటుంబ పరిస్థితులు.

క్రిష్ణమూర్తి విశాఖపట్నంలోని ఎ.వి.యన్. కాలేజీలో బి.. చదువుతూ తాత తండ్రులిచ్చిన ఆస్తుల్ని ఖర్చు చేస్తూ కులాసాగా కాలం గడిపే విలాస యువకుడు.

ఏ పని చేసినా నేను కళ్ళు తెరుచుకునే చేస్తాను. నాకూ మిగతావాళ్లకీ అదే తేడా. ఏడుస్తూ ఏదీ చేయ్యాను. ఏం జరిగినా ఏడవను…” ఇది ఇందిర వ్యక్తిత్వం.

విభిన్న మస్తత్వాలు గల ఈ నలుగురి మధ్య సహృదయులైన వసుంధర, డాక్టర్ చక్రవర్తి

ఈ ఆరుగురి మధ్య జరిగే చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎవరిని ఎవరి దరి చేర్చాయో తెలుసుకోవాలంటే సహజత్వానికి అద్దం పట్టే డాపి. శ్రీదేవి గారి కాలాతీత వ్యక్తులుచదవవలసిందే.

6. అమరావతి కథలు

Buy Online – Amazon | Telugu Books | Anand Books

గుంటూరు జిల్లా అమరావతిలో 1937వ సంవత్సరం మార్చి నెల మూడవ తేదీన శేషమ్మ, కుటుంబరావులకు జన్మించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు పసితనంలోనే దూరమైపోగా సీతమ్మ, పెద్దపున్నమ్మ గారలు సత్యంను పెంచీ పెద్ద చేశారు. సాహిత్యాభివృద్ధికి అన్నలు రామారావు, రాధాకృష్నమూర్తి, పూర్ణానంద శాస్త్రి గార్లు ప్రోత్సహించారు.

అమరావతి కథలువ్రాసినా, ‘కార్తీక దీపాలువెలిగించినా నిజమైన న్యాయవాదమే మౌలికమైన సూత్రం ఆయనకు. పాఠకుణ్ణి ఏకబిగిగా చదివించే గుణం సత్యం కథలలో ఉంది.

అమరావతి కథలకు 1979వ సంవత్సరంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినది. శ్యామ్‌బెనెగల్‌ దర్శకత్వంలో అమరావతి కథలు దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి.

గమనిక: జనవిజయం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here