భారతీయతను కాపాడుకుందాం

0
322

అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన “వేదాలని పోగొట్టుకున్న వెర్రి సన్నాసులు భారతీయులు” అని ప్రపంచం ఇప్పటికే ఉమ్మేసింది.

జీవన ధర్మాన్ని బోధించిన గొప్ప శక్తి ఐన ’భగవద్గీత‘ ని చనిపోయినపుడు మాత్రమే వినే తెలివి తక్కువ మూర్ఖులు భారతీయులు” అని హేళన చేస్తోంది.

ఆయుర్వేదంలో ఉన్న గొప్ప ఆరోగ్యాన్ని వదులుకుని “ఇంగ్లీష్ మందుల వెంట పడుతున్న అజ్ఞానులు భారతీయులు” అని ఈ ప్రపంచం నవ్వుకుంటోంది.

నిత్యయవ్వనంగా ఉంచే “యోగశాస్త్రాన్ని కాపాడుకోలేకపోయిన రోగులు భారతీయులు” అని ఈ ప్రపంచం మనని చూసి పరిహాసం ఆడుతోంది.

“నీ జీవిత పరమార్ధాన్ని వివరించే నీ దేశం లోనే పుట్టిన గొప్ప శక్తి ఐన “ధ్యానం వొదిలేసి ఎందుకురా మా పిచ్చి సంస్కృతి ని ఫాలో అవుతున్నారు తెలివిలేని భారతీయులు” అని ఈ ప్రపంచం మనల్ని వెక్కిరిస్తోంది.

అణువణువునా శక్తి ని నింపుకుని అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే “ఆవుని కాపాడు కోలేక పోయిన మీకెందుకురా ఆవేశం” అని హేళన చేస్తోంది.

అమెరికన్స్ ఐన మేము మీ వేప చెట్టుని పసుపు ని కొన్ని కోట్లు పోసి కొంటుంటే మీ ఇంటి ముందే ఉన్న ఆ చెట్లని కొట్టేస్తున్న తెలివి తక్కువ దద్దమ్మల్లారా “మీ దేశ గొప్పతనం మీకే తెలియకుంటే ఎలారా అని నిలదీసి మరీ ఈ ప్రపంచం మనమీద జాలి పడుతోంది.”

నాన్న! ఇంత గొప్ప దేశంలో పుట్టి ఇంత గొప్ప సంస్కృతిని జీవన ధర్మాన్ని ఎందుకు కాపాడలేకపోయావు నాన్న?!” అని రేపు మన బిడ్డలు అడగక ముందే జాగ్రత్త పడుదాం.

చెడును వదిలేద్దాం! 

మంచిని ఆదరిద్దాం!! 

'భారతీయత'ని కాపాడుకుందాం!!!

మిత్రులందరికీ షేర్ చేయండి

సేకరణ:- ఆమంచి సురేష్ శర్మ, పురోహిత్, ఖమ్మం +918341838181

 

గమనిక: జనవిజయం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here