బోనకల్ మండలంలో ‘రైతుబంధు’ పాస్ బుక్కులు పంపిణీ చేసిన తుమ్మల

0
9

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండల పరిధిలో బుధవారం తుటికుంట్ల, గోవిందాపురం గ్రామాలలో రైతు బంధు పాస్ బుక్కులు పంపిణీ చేసారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వరరావు చేతులు మీదుగా రైతులకు పాస్ బుక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు బోనకల్ జెడ్.పి.టీ.సీ. బాణోత్ కొండ, ఎంపీపీ చిట్టుమోడు నాగేశ్వర రావు, .టి.ఆర్.ఎస్ నాయకులు లింగాల.కమలరాజు, బొమ్మెర.రామూర్తి, మండల వ్యవసయదికారి  వాహిని. తహసీల్దారు, ఎంపీడీఓ. , వి.ఆర్.వో లతో పాటు బోనకల్ మండల టి.ఆర్.ఎస్ నాయకుడు బంధం శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మలకు ఘన స్వాగతం లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here