ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించాలి – సుప్రీం తీర్పును పునఃపరిశీలించాలి

0
20

(మందా సత్యానందం, జనవిజయం ప్రతినిధి,బోనకల్)

  • ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించాలని కే.వి.పి.ఎస్, వసాయ కార్మిక సంఘం డిమాండ్
  • సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం
  • బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయి

ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని చట్టాన్ని సవరిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ స్థానిక మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి కే.వి.పి.ఎస్, వసాయ కార్మిక సంఘంల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. కులవివక్షత వ్యతిరేక సంఘం (కే.వి.పి.ఎస్), వ్యవసాయ కార్మిక సంఘాల కమిటీల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కే.వి.పి.ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కొమ్ము శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోత్ నరేష్ లు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వల్ల దళిత,గిరిజనులలో అభద్రతా భావం నెలకొందన్నారు. తక్షణమే ఈ తీర్పును పునః పరిశీలనచేసి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్తీల, ముస్లింల, మైనార్టీలపై దాడులు పెరిగాయని, దళితులు, ముస్లింల ఆహారపు అలవాట్లు పై దాడులు చేస్తు ధరించే ద్రెస్ పై కూడా ఆంక్షలు విధిస్తుందన్నారు. దళితులు గుర్రం ఎక్కి స్వారీ చేస్తే చంపుతున్నారనీ, విద్యాలయాలలో ఉద్యోగాలలో రిజర్వేషన్ లేకుండా ఎత్తివేయాలని బిజెపి చూస్తున్నదని అంబెడ్కర్ ప్రవేషపెట్టిన రిజర్వేషన్ వెత్తివేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీలకు తీవ్ర లోటు జరుగుతుందని, దీనిని అందరూ అభ్యుదయవాదులు అంబెడ్కర్ వాదులు తీవ్రంగా ఖండించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎత్తివేస్తే దాడులు విపరీతంగా పెరుగుతాయని వివక్షత ఇంకా తీవ్రతరం అవుతుందని దళితులు, గిరిజనులు ఆర్థిక సామజిక దోపిడీకి గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం తరుపున రీ ఓపెన్ ఫిటీషన్ సుప్రీంకోర్టు లో వేయించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించాలని సంతకాల సేకరణ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కె.వి.పి.ఎస్ నాయకులు ఏసుపోగు బాబు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బాణోత్ ఉపేంద్ర, ముంద్రావత్ కళ్యాణ్, గుగులోత్ సాయి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here