ఎవరి సహకరం లేకుండా ఎవరూ జీవించలేరు!

0
428

“సహాయం”

చేసినవాడు మరచిపోవలసినది – పొందినవాడు గుర్తుంచుకోవలసినది అంటారు.

“సహాయం”

ఎవరికైనా ఇతరుల సహాయం అవసరమే.

“సహాయం”

అందరూ అందరికి అవసరమైనప్పుడు సహాయం చేయాలనే బుద్ధి మాత్రం అందరికీ సమానం గా ఉండదు.

?

నేడు కనీసం అయినవాళ్ల మధ్య కూడా కనీస సహాయాలు లభిస్థాయన్న భద్రతా వాతావరణం లేదు.

ప్రతి మనిషీ నిత్య అభద్రతలోనే జీవిస్తున్నాడీ రోజుల్లో .

అందుకే ఓ సినీ కవి అన్నాడు.

మనసున మనసై , బ్రతుకున బ్రతుకై తోడకరుండిన అదే భాగ్యమూ , అదే సౌఖ్యమూ అని.

మరో సినీ కవి ఇలా అన్నాడు.

మళ్లున్నా , మాణ్యాలున్నా పంచుకునే మనిషుండాలీ అని.

కానీ నేడు కెరీరిజం , డబ్బు …. పిచ్చతో మనిషి మానవత్వాన్ని కోల్పోతున్నాడు.

ఇంకో సినీ కవి చెప్పినట్లు….

మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడూ… మచుకైనా కానరాడు చూడు మానవత్వం ఉన్నవాడూ…

స్వార్ధం అనేది నాశనం కావాలంటే , స్వార్ధం యొక్క మూలాలేమిటి అనేది నిజాయితీగా వెతకాలి.

ఇక్కడే ఉంది అసలు సిసలు తాత్వికత.

మనం తెలుసుకోవలసింది – తేల్చుకోవలసింది కీలకమైన అంశమదే !

– పల్లా కొండలరావు

గమనిక: జనవిజయం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here