ఘనా ఘన సుందరా! ఘంటసాల మాస్టారిలా!!

0
334
  • ఘంటసాల పాడుతుంటే చూశారా? ఆయన గతించి నాలుగు దశాబ్ధాలు అయినా… (జననం: డిసెంబర్ 4, 1922 – మరణం: ఫిబ్రవరి 11, 1974 ) తెలుగునాట ప్రతీరోజు ఏదో ఓ చోట ఆయన గానం వినిపిస్తూనే ఉంటుంది. ఆయన గాత్రం అంతగా ప్రభావితం చేసింది.
  • అంతటి ప్రభావం కలిగించిన వ్యక్తి మీ ముందు పాడుతుంటే ఎలా ఉంటుంది? అప్పట్లో ఇంతటి సాంకేతిక విలువలు, టీ.వీ మీడియా లేదు కనుక సెలబ్రెటీల ప్రోగ్రాములూ ఏ కొద్దిమందో చూసేవారు. ఇప్పుడైతే ఇంట్లో ఉండే క్షణాలలో ప్రపంచ సంఘటనలను చూస్తున్నాము.
  • ఘంటసాల పాడుతుంటే ఎలా ఉంటుందని ఊహిస్తూ తయారు చేసిన ఏనిమేషన్ ఇది. దీనిని తౌటి సంతోష్ కుమార్ తయారు చేశారు. యూట్యూబ్ లొ ఈ వీడియో ఉన్నది.
  • పెరిగిన సాంకేతికతతో ఎన్నో పైత్యపు పనులు చేస్తూ సొల్లు, చెత్తను సోషల్ మీడియాలో వదులుతుండడం చూస్తుంటాము.
  • అనేక అంశాలపై మనలను ఆలోచింపజేసే, ఆనందింపజేసే క్రియేటివిటీలు ఉంటున్నాయి. అలాంటివాటిలో ఈ వీడియో ఒకటి.
  • ఘంటసాల మాష్టారు మనముందు భక్తతుకారాం సినిమాలో దేవులపల్లి వారి పాటని పాడితే ఎలా ఉంటుందో ఊహిస్తూ తయారయిన ఈ ఏనిమేషన్ ను మీరూ చూడండి.
  • సంతోష్ గారు మీరు ఇలాంటివి మరిన్ని చేయాలని , వీలయితే ఇప్పటి హీరోలు , గాన గంధర్వుడి పాటకు యాక్ట్ చేస్తున్నట్లు తయారు చేస్తే వెకిలి పాటలనుండి వెకిలి సాహిత్యం నుండి కొంతయినా విముక్తి కలుగుతుంది.
  • ఇప్పటి తరం వారికి మన సంస్కృతీ సాహిత్యం విలువలు వాటి గొప్పతనం గురించి ఇండైరెక్ట్ గా నైనా ఇంజెక్ట్ చేసినవారవుతారు .
(ఘంటసాల గారు పాడుతున్న ఫోటో గూగుల్ సెర్చ్ ద్వారా సేకరించినది. ఏ పాట పాడుతుంటే తీసినది తెలీదు)

గమనిక: జనవిజయం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here