డయాబెటిస్ వారు వి.ఆర్.కె డైట్ ఎలా విరమించాలి?

0
157

‘డయాబెటిస్’ ఉన్న వారు ‘వీరమాచనేని రామకృష్ణ విధానం’ అవలంబించే పధ్ధతి ఏమిటి? ఎలా బయటకు రావాలి? ఎన్ని రోజులు చేయాలి? ఏ టెస్టులు చేయించుకోవాలి అన్న వివరాలు రామకృష్ణ మాటల్లోనే విని తెలుసుకోండి. telugu tv online వారు చేసిన ఇంటర్వ్యూలో డయాబెటిస్ పై ఆయన చెప్పిన వివరాలవరకూ ఓ పార్ట్ గా ఉన్న వీడియో ఇది.

డయాబెటిస్ ఉన్న అందరూ ఒకే పద్ధతిని అవలంబించడం 90 రోజులు చేసి మానేసి వెంటనే కార్బ్ తీసుకుని మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరగడంతో ‘కంగారు పడడం’ ఎక్కువగా జరుగుతుంది. మన ఆరోగ్యం కోసం మనం ఏమి చేయాలి? అనేది జాగ్రత్తగా మనమే తెలుసుకోవాలి. ఒకసారి అర్ధం కాకపొతే మళ్ళీ మళ్ళీ విషయాన్ని అర్ధం చేసుకుని ప్రయత్నించాలి. విజయం సాధించాలి తప్ప, అరకొరగా…. అర్ధం పర్ధం లేకుండా చేయడం మంచిది కాదు. ఏ విచ్చలవిడితనం వలన షుగర్ వచ్చిందో దానిని జీవితం నుండి పారద్రోలకుండా షుగర్ పోవాలనుకోవడం ఓ రకంగా మూర్ఖత్వమే అవుతుంది. దయచేసి ఎవరూ ఆ తప్పులు చేయడం, అనవసరంగా కంగారు పడుతూ , ఇతరులను కంగారు పెట్టడం చేయకండి.

విచ్చలవిడితనం లేకుండా అన్ని రుచులు అనుభవిస్తూ తినే హక్కును మన చేతుల్లో ఉంచుకోవడానికి రామకృష్ణ విధానాన్ని ఓ ఆయుధంలా వాడుకోండి. అంతే తప్ప అన్ని తప్పులు అలాగే చేస్తా…. ఆరోగ్యం రావాల్సిందే… అనుకోవడం అత్యాశే అవుతుంది. కనుక ప్రతి విషయాన్ని ఓపికగా పదే పదే రామకృష్ణ వీడియోలను చూడడం, సందేహం వస్తే నిర్మొహమాటంగా వాట్సప్ గ్రూపుల ద్వారా తెలుసుకోవడం, ‘జనవిజయం’ కు సందేహాలను వ్రాసి రామకృష్ణగారి ద్వారా సందేహాలు పొందడం చేయండి. మీరు తెలుసుకోవడమే గాక మీ చుట్టూ ఉన్న పదిమందికి సరైన మార్గం చూపండి. ఆరోగ్యవంతమైన ప్రపంచం కోసం మీరూ కృషి చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.