మొదటి కేసు కే.సి.ఆర్ పైనే పెట్టాలి – సి.పి.ఎం

0
10

  • విక్రమ్ పై అక్రమ కేసును ఎత్తివేయకపోతే ఆందోళన
  • ప్రజా సమస్యలు పై ప్రశ్నిస్తే అసహానానికి గురై కేసులు పెడుతారా?
  • చందాల పార్టీ లుగా మేము గర్వపడుతున్నాం 
  • లంగాలు, లఫంగీలు అంటూ విమర్శలు చేసిన కే.సి.ఆర్ పై మొదటి కేసు పెట్టాలి
  • నాలుగేళ్ళలో పువ్వాడ అజయ్ అభివృద్ధి, వాగ్ధానాలు, అక్రమాలుపై బహిరంగ చర్చకు సవాల్ 

సీపీఎం టు టౌన్ కార్యదర్శి వై. విక్రమ్ పై  ఖమ్మం ఎం.ఎల్.ఏ పువ్వాడ అజయ్ కుమార్ అక్రమంగా పెట్టిన కేసును ఎత్తివేయకపోతే ఆందోళన చేస్తామని సీపీఎం బోనకల్ మండల కమిటీ  కార్యదర్శి దొండపాటి. నాగేశ్వరారావు, జిల్లా కమిటీ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావులు తెలిపారు. బుధవారం బోనకల్ సి.పి.ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అధికార పార్టీ  ప్రతిపక్షాల ఉనికిని సహించలేక పోతుందన్నారు. ప్రభుత్వ పని తీరు, ప్రజా సమస్యలు పై ప్రశ్నిస్తే అసహానానికి గురై కేసులు పెడుతారా? అంటూ వారు ప్రశ్నించారు. ఖమ్మం ఎం ఎల్ ఏ మేడే సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ ల పై విమర్శలు చేశారు. ‘చందాల పార్టీ’ అని….ఖమ్మం గ్రెయిన్ మార్కెట్‌ ను ఎవరో తరలిస్తే సర్వశక్తులు ఒడ్డి అడ్డు కున్నట్లు చెబుతున్నారు. ప్రజలనుండి చందాలు ద్వారా రాజకీయం చేస్తున్నందుకు చందాల పార్టీ లుగా మేము గర్వపడుతున్నామన్నారు. కార్పోరేట్ డబ్బులు, సెటిల్ మెంట్లు, అక్రమంగా డబ్బులు సంపాదించే పార్టీ లు మావి కావు. సోషల్ మీడియా లో కామెంట్స్ పెడితే ఎంఎల్ ఏ ను కించ పర్చారు అని ఎంఎల్ ఏ పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం అర్బన్ పోలీసు స్టేషను లో కేసు పెట్టారు. కేసులు పెట్టాలంటే ముందు గా సీఎం కేసీఆర్ పై పెట్టాలి. ప్రతి పక్షాలను లంగాలు, లఫంగీలు అంటూ విమర్శలు చేశారు.బోనకల్ మండలం లో టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మైనారిటీ ల పై నరుకుతాం, చంపుతామని బెదిరింపులు ఉపన్యాసం చేశాడు. ఎంఎల్ ఏ పువ్వాడ అజయ్ కుమార్ సిపిఎం పై కొపం పెంచుకున్నాడు. ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఎంఎల్ ఏ పై అసంతృప్తి పెరిగిందని భయపెడుతున్నాడు. కేసులు, నిర్బంధాలు కు భయపడే వాళ్ళం కాదు. తుపాకుల గుండ్లకు నిలబడిన పార్టీ సిపిఎం. తాటాకుల చప్పట్లకు భయపడేవాళ్ళం కాదు.ఎంఎల్ ఏ పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ గుర్తు పై గెలిచారు. నియోజకవర్గం ప్రజలను మోసం చేశాడు. పార్టీ మారిన తరువాత ఎంఎల్ ఏ పదవికి రాజీనామా చేయాలన్నారు. ఎంఎల్ఏ పువ్వాడ అజయ్ కుమార్ తో బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్  చేసారు. నాలుగేళ్ళలో పువ్వాడ అజయ్ చేసిన అభివృద్ధి, వాగ్ధానాలు, అక్రమాలు, ఖమ్మం కార్పొరేషన్ లో అవినీతి పై , డిజిల్ కుంభకోణం చర్చించుకుందాం. మీడియా సమక్షంలో ఇతర రాజకీయ పార్టీల తో కలిసి పెవిలియన్ గ్రౌండ్ లో చర్చా వేదికకు సిద్దమా? అన్నారు. సిపిఎం పార్టీ నాయకుల మీద పెట్టిన అక్రమ  కేసులు ను ఎత్తివేయాలి. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో  జిల్లా నాయకులు చింతలచెరువు కోటేశ్వరావు, మండల కార్యదర్శి  దొండపాటి నాగేశ్వరావు, ఎంపీపీ చిట్టుమోదు నాగేశ్వరావు, Ex. ఎంపీపీ, జడ్పీటీసీ. కొమ్ము శ్రీనివాసరావు, గుగులోత్ నరేష్ , బోయనపల్లి  కొండ, మాధినేని రామచంర్రావు, మహిళ నాయకులు మాధినేని లక్ష్మీ, మర్రి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here