చిరస్మరణీయుడు కామ్రేడ్ వంగల బసవయ్య

0
15

చిరస్మరణీయుడు కామ్రేడ్ వంగల బసవయ్య


మూడవ వర్ధంతి సభలో సీపీఐ ఖమ్మం జిల్లా సమితి సభ్యులు యంగల ఆనంద్ రావ్, తూము రోషన్ కుమార్ లు

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) బోనకల్ మండల మాజీ కార్యదర్శి , మోటమర్రి మాజీ సర్పంచ్, మాజీ సొసైటీ అధ్యక్షులు, భావితరాలకు ఆదర్శప్రాయుడు కామ్రేడ్ వంగల బసవయ్య చిరస్మరణీయుడని సీపీఐ ఖమ్మం జిల్లా సమితి సభ్యులు యంగల ఆనంద్ రావ్, తూము రోషన్ కుమార్ లు  కొనియాడారు. బోనకల్ మండలం మోటమర్రి లో కామ్రేడ్ బసవయ్య 3వ వర్ధంతి సందర్భంగా ఆయన స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆ గ్రామ శాఖా కార్యదర్శి బుర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో యాంగల ఆనంద్ రావ్  మాట్లాడుతూ మోటామర్రి గ్రామ సర్పంచిగా బసవయ్య చేసిన అభివృద్ధి పనులు నేటి యువతరానికి తెలిసేలా ప్రచారం చెయ్యాలని గ్రామ కార్యకర్తలను కోరారు . మోటామర్రి లో అంతర్గత రహదారులు, మోటామర్రి నుండి కలకోట ప్రధాన  రహదారి కొరకు అమరజీవి కామ్రేడ్ తూము ప్రకాశ్ రావ్ సారధ్యంలో బసవయ్య నే పట్టుబట్టి రాబట్టారాని ఆయన తెలిపారు . కామ్రేడ్ వంగల బసవయ్య మండల కార్యదర్శిగా ఉన్నప్పుడు తాను మండల సహాయ కార్యదర్శిగా ఉన్నానని ఆ సమయంలో గ్రామ అభివృద్ధి కోసం, పార్టీ అభివృద్ధి కోసం బసవయ్య పడ్డా తపన తనకు ప్రత్యక్షంగా తెలుసునన్నారు. నల్లమోతు పిచ్చయ్య, రావెళ్ల జానకిరామయ్యా, వాసిరెడ్డి వెంకటపతి, తూము ప్రకాష్ రావు, యాంగల రాములు , వేమపటి సాంబయ్య, పారుపల్లి చిన్న పుల్లయ్య, లాంటి కమ్మునిస్ట్ యోధుల మధ్యలో యువ నేతగా మెళుకువలు తెలుసుకున్న ఆయన మోటామర్రి నుండి బయ్యారం మీదుగా మధిర రహదారి కోసం చేసిన పోరాటం  చరిత్రక్రెక్కిందని ఆయన గుర్తుచేశారు. నీటిసంగం అధ్యక్షుడుగా రైతులకు నీరందించే విషయమై ఆయన చేసిన చొరవ, బయ్యారం-అల్లినగరం-మోటామర్రి లిఫ్టు చైర్మన్ గా ఉన్నా సమయంలో ఆయన లిప్టు ను నిడిపించిన తీరు ఆదర్శనీయం, శ్లాఘనీయం అని ఆయన కొనియాడారు. ఈ సభ లో సీపీఐ బోనకల్ మండల కార్యదర్శి తోట రామాంజనేయులు, సహాయ కార్యదర్శి మాతంగి శ్రీనువాసు, మండల కార్యవర్గ సభ్యులు మరీదు నరసింహ రావు, వంగల ముత్తయ్య,వంగల నరేంద్ర, వగాల కృష్ణా, మందా కృష్ణారావ్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here