అన్ని నియోజకవర్గాలలోనూ బి.ఎల్.ఎఫ్ పోటీ – నున్నా

0
16
ఖమ్మం పార్లమెంట్‌తో పాటు  

7  అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ బి.ఎల్.ఎఫ్ పోటీ

– బి.ఎల్‌.ఎఫ్‌ కన్వీనర్‌ ‘నున్నా’ ప్రకటన

(జనవిజయం ప్రతినిధి, ఖమ్మం)

ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రాబోయే కాలంలో బిఎల్‌ఎఫ్‌ను బలోపేతం చేస్తామని, ఖమ్మం పార్లమెంట్‌తో సహా 7 అసెంబ్లీ స్థానాలకు బి.ఎల్‌.ఎఫ్‌ పోటీ చేస్తుందని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బిఎల్‌ఎఫ్‌) ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌గా నూతనంగా ఎన్నికైన నున్నా నాగేశ్వరరావు తెలిపారు. మంగళ, బుధ వారాలో ఖమ్మంలో జరిగిన ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సదస్సులో నున్నాతో పాటు మరో 22 మందితో ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గ కమిటీని బిఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం, తదితర రాష్ట్ర నాయకుల పర్యవేక్షణలో ఎన్నుకున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని ఏడు శాసన సభ నియోజకవర్గాల నుండి 250 మంది ప్రతినిధులు  హాజరయ్యారు. మహాజన సమాజం పార్టీ రాష్ట్ర నాయకులు భీమన్న, సిపిఎం కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రైతు సంఘం నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, కాసాని ఐలయ్య, టి-మాస్‌ జిల్లా కన్వీనర్‌ యర్రా శ్రీకాంత్‌, స్టీరింగ్‌ కమిటి సభ్యురాలు బుగ్గవీటి సరళ, బత్తుల లెనిన్‌, కళ్యాణం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, బండి రమేష్‌, భూక్యా వీరభద్రం, అశ్వారావుపేట సర్పంచ్‌ కొక్కెరపాటి పుల్లయ్య, సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, సామాజిక సంఘాల నాయకులు డాక్టర్‌ బి.వి.రాఘవులు, అల్లిక వెంకటేశ్వర్లు, మీగడ రామారావు, గుంతేటి వీరభద్రం, లిక్కి కృష్ణారావు, యాకూబ్‌ పాషా, అప్జల్‌ మూసా, విజయ భాస్కర్‌ వున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల సదస్సులను ఏర్పాటు చేసి కమిటీలు వేయాలని నిర్ణయించారు. మే 22న అశ్వారావుపేట, 23న కొత్తగూడెం, 24న వైరా, ఖమ్మం, 25న సత్తుపల్లి, 30న మధిర, 31న పాలేరు నియోజకవర్గ సదస్సులను జరపాలని నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here