వీరమాచనేని విధానం అనుసరించేముందు ఏమి చేయాలి?

0
78

‘వీరమాచనేని విధానం’ అవగాహన  – 5

గత వ్యాసంలో వీరమాచినేని రామకృష్ణ వివరాలను తెలుసుకున్నాం.  ఆయన చెప్తున్న విధానం అనుసరిస్తున్నవారిలో చాలామంది  తెలియక తప్పులు చేస్తున్నారు. కొందరు మధ్యలో ఆపేస్తున్నారు. కొందరు పుకార్లు నమ్మి భయపడుతూ ఆపేస్తున్నారు. ఇంకొందరు డాక్టర్లు భయపెడుతుంటే ఆపేస్తున్నారు. అవగాహన ఉన్న డాక్టర్లు సమర్ధిస్తుండంతో మరికొందరు ముందడుగు వేస్తున్నారు. ఇలా… ఓవైపు ఆచరించిన వారు సత్ఫలితాలు పొందుతుంటే మరికొందరు దీనిని సరిగా వినియోగించుకోలేక పోతున్నారు. కొందరు పూర్తిగా తెలుసుకోకుండా ఈ విధానం అనుసరించి ఫలితాలు రాక పెదవి విరిచేవారూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చెప్తున్న ఆహార విధానం ఆచరించాలని భావించేవారు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ఈ వ్యాసంలో చర్చించే ప్రయత్నం చేద్దాం. 
 1. ముందుగా చేయాల్సింది ఈ విధానంలో శ్రద్ధగా పాటించాల్సిన నియమాలు, ఆహారవిధానం గురించి అవగాహన చేసుకోవాలి. ఇందుకు గాను స్వయంగా రామకృష్ణ సభలకు హాజరయితే మంచిది.
 2. అలా వీలు కాకపొతే యూ ట్యూబ్ లో పూర్తి నిడివి ఉన్న ఆయన వీడియోలను చూడండి. వీటిలో కాన్సెప్ట్, ఫుడ్ ప్రోగ్రాం, ప్రశ్నలు-జవాబులు అనే మూడు విభాగాలను శ్రద్ధగా అవగాహన పొందాలి.
 3. మొబైల్ లో కాకుండా పెద్ద స్క్రీన్ మీద కుటుంబ సభ్యులందరూ కూర్చుని చూస్తే మంచిది.
 4. సభకు వెళ్ళినా ఒక్కరు కాకుండా భార్యా భర్తలు తప్పనిసరిగా కలసి వెళ్లండి. కుటుంబ సభ్యులు మిత్రులను వెంటబెట్టుకుని వెళ్లండి. కుటుంబంలో అందరికీ అవగాహన ఉంటే తప్పులు జరగకుండా ఉంటుంది.
 5. వెంట ఒక నోట్ బుక్ తీసుకెళ్ళండి. అవసరమైన ప్రతి అంశాన్ని శ్రద్ధగా వ్రాసుకోండి. అనుమానాలను ఆ సభలోనే అడిగి తెలుసుకోండి.
 6. వీడియోలు చూసేటపుడయినా ఇదే పద్ధతిని అనుసరించండి.
 7. అర్ధం కాకుంటే ఈ విధానం గురించి బాగా తెలిసిన వారిని ఇంతక్రితమే ఫలితం పొందిన వారి అనుభవాలను గురించి తెలుసుకోండి.
 8. మీకు పూర్తి అనుమానం తీరేదాక నిర్మొహమాటంగా సమాధానంకోసం ప్రయత్నించాలే తప్ప అరకొర సమాచారంతో చేయకండి.
 9. అప్పటికీ అర్ధం కాకుంటే జనవిజయం కు మీ ప్రశ్నలు వ్రాసి పంపండి.
 10. ఓ యజ్ఞంలా మీ జీవితంలో ఆరోగ్యం ఆనందం కోసం చేసే ఈ పనిపట్ల దయచేసి ఏ మాత్రం అశ్రద్ధ వహించకండి.
 11. ఈ ఆహార విధానం గురించి ఏ అనుమానం లేకుండా సంపూర్ణంగా తెలుసుకున్న తరువాత పూర్తి స్థాయి శరీర పరీక్షలు చేయించుకోండి.
 12. సరైన ప్రామాణికాలు పాటించే లేబ్ లలో మాత్రమే పరేక్షలు చేయించుకోవడం మంచిది.
 13. మీకు మీరు అంతా ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకోవడం కంటే పరేక్షలు చేయించుకుంటే ఎవరు ఎలా ఈ విదానంను అనుసరించాలనేదానిలో స్పష్టత ఉంటుంది.
 14. టైప్ 2 మధుమేహం ఉన్నవారు మాత్రం వెంటనే మందులు ఆపేయాలి. మందులు ఓ వైపు వేసుకుంటూ, మరోవైపు ఈ విధానం పాటిస్తే ప్రాణాలకే ప్రమాదం. ఎట్టి పరిస్తితులలోనూ స్వంత పైత్యం ప్రదర్శించడం మంచిది కాదు.
 15. మధుమేహం మినహా మిగతా వ్యాధులతో బాధపడేవారు వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ వారం, పది రోజులకోసారి పరేక్షలు చేయించుకుంటూ మందుల డోసులు తగ్గించుకుంటూ వెళ్ళాలి.
 16. ఈ ఆహార విధానంలో సూచించిన పదార్ధాలను ముందుగా సమకూర్చుకోవాలి. కల్తీ లేకుండా చూసుకోవాలి.
 17. పెళ్ళిళ్ళు, పేరంటాలు వంటివి ముఖ్యమైనవి ఉంటే అవి పూర్తయ్యాక మాత్రమే ప్రోగ్రాం మొదలు పెట్టండి.
 18. మధ్యలో ఎట్టి పరిస్తితిలోనూ మానేయడం లేదా నియమాలు తప్పడం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసుకోండి. 
 19. ఆయా వ్యక్తులను బట్టి వారి సమస్యలను బట్టి 7 రోజులనుండి 3 లేదా 4 నెలలు ఈ విధానం అనుసరిస్తే చాలు. ఈ విధానం అనుసరిస్తున్నంత కాలం చాలా జాగ్రత్తగా నియమాలు పాటించాలి.
 20. ఆహారంలో తినదగినవి, తినగూడనివి అని 2 లిస్టులు ఉంటాయి. వీటిలో తినకూడనివి అన్నవాటిలో ఒక్కటి కూడా ముట్టుకోడానికి వీలు లేదు.
 21. తినకూడని వాటిలో మంచి ఆహారం ఉన్నా ఈ ప్రోగ్రాం కు అడ్డం వస్తాయి కనుక ఆపాల్సిందే.
 22. తినాలి అన్న వాటిలో 4 పిల్లర్స్ గా చెప్పిన వాటిని తప్పక తూ.చ తప్పకుండా విధిగా పాటించి తీరాలి.
 23. తినాల్సిన వాటిలో మిగతావి తినడం,తినక పోవడం మీ ఇష్టం.
 24. తినేవిధానం గురించి ఆయన చెప్పేవిధానం ….ఆకలి వేసినపుడు మాత్రమే తినడం, ఆకలి తీరేదాక తినడం, మళ్ళీ ఆకలి వేసే వరకూ తినకపోవడం, మళ్ళీ ఆకలి తీరేవరకు మాత్రమె తినడం, విచ్చలవిడితనం అనేదానికి స్వస్తి పలకడం చేయాలి.
 25. ప్రోగ్రాం చేస్తున్నంత సేపే కాకుండా మీ జీవనవిధానంలో ఇది ఒక మంచి అలవాటుగా మారి తీరాలి. మీ కుటుంబ సభ్యులు ఇతరులకు కూడా దీనిని బాగా నేర్పండి. ప్రచారం చేయండి. సమాజం బాగుంటే మనం బాగుంటాం. సమాజం ప్రభావం మనపైనా మన ప్రభావం సమాజం పైనా ఉంటుంది.
 26. ఈ విధానం ప్రారంభించిన మొదట్లో వ్యక్తులను బట్టి కొన్ని లక్షనాలు 3 నుండి 10 రోజుల వరకూ కనిపిస్తాయి. వీటిలో విరేచనాలు, వాంతులు, కళ్ళు తిరగడం, తల త్రిప్పడం, చర్మంపై ఎలర్జీలు వంటివి రావడం, ఒళ్ళు నేప్పులుగా అనిపించడం, తలనెప్పిగా ఉండడం వంటి లక్షనాలు కనిపిస్తాయి.
 27. ఇవి అందరికీ కనిపించాలని లేదు. కొందరిలో కొన్ని కనిపిస్తాయి. కొందరిలో వీటిలో ఎక్కువగా కూడా కనిపిస్తాయి.
 28. వీటికి భయపడకూడదు. శరీరం గ్లూకోజ్ నుండి ఫేట్ మెటబాలిజం వైపుకు మారుతున్నపుడు కనిపించే తప్పనిసరి అవలక్షనాలు ఇవి. గర్భిణీ స్త్రీలకూ వాంతులు రావడం లాంటిదే ఇది. కనుక దీనిని గురించి ఆందోళన, కంగారు అనవసరం. 
 29. మొదట్లో వచ్చే ఇబ్బందికర లక్షణాలకు సంబంధించి సమస్య మరీ ఇబ్బందిగా ఉంటే వైద్యుని సలహా మేరకు అల్లోపతి మందులు వాడాలి.
 30. హోమియో, ఆయుర్వేదం మందులను మాత్రం ఈ ప్రోగ్రామ్లో ఉండగా వాడవద్దు.
 31. ఈ సమస్యనుండి బయటపడ్డాక మీ శరీరంలో వచ్చే మార్పులను బట్టి ఎంత ఫలితం పొండుతున్నదీ అనుభవించేవారికే అవగతం అవుతుంది. ఆ పరిస్తితిలో ప్రోగ్రాం ను మనమన్నా మానరు.
 32. కనుక ప్రోగ్రాం మొదలు పెట్టిన మొదట్లో వచ్చే సమస్యలను అధిగమించడం అన్నది మొదటి సవాల్ గా భావించాలి.
 33. వీలయితే బరువు కొలిచే, మధుమేహం కొలిచే, బి.పి యంత్రాలను ఇంట్లో ఉంచుకుని ప్రతిరోజూ చెక్ చేసుకోండి.
 34. అలా సాధ్యం కానివారు అవసరాన్ని బట్టి ఎప్పటికపుడు పరేక్షలు చేయించండి.
 35. పరేక్షల ఫలితాలను ఫైల్ చేయండి.
 36. నీరసం స్తితిని బట్టి ఫ్యాట్ కొలతలో తేడాలను సరిచేసుకోండి. 
 37. ఈ విధానంపై అవగాహన లేకుండా భయపెట్టే, మాట్లాడే పుకార్లను నమ్మకండి. ఏ ఆధారంతో వారు అలా మాట్లాడుతున్నారో తెలుపమని చెప్పండి. ఈ ప్రోగ్రామ్లో తీసుకునే పదార్ధాలలో దేనివల్ల ఏ ఇబ్బందో చెప్పమనండి.
 38. ఈ విధానంపై అవగాహనను అప్తేడ్ అయిన డాక్టర్ పి.వి. సత్యనారాయణ గానీ వందలాది మంది డాక్టర్ల వివరాలను వారికి చెప్పండి. మీరూ అలాంటి వైద్యుల వివరాలు తెలుసుకోండి.
 39. డాక్టర్లు మెడికల్ గైడ్ లైన్స్ ఫాలో అవుతారు కనుక వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలా కాక కావాలని వ్యతిరేకించడమే ఎజెండాగా పెట్టుకునే వైద్యులను నమ్మకండి. అలా చెప్పే డాక్టర్ల వద్దకు వెళ్లకండి. అలాంటి డాక్టర్ల వద్దకు మీ స్నేహితులనూ వెళ్ళకుండా ప్రచారం చేయండి.
 40. సమాజానికి ఓ అద్భుత వరంలా ముందుకొచ్చి చక్కటి ఫలితాలు ఇస్తున్న ఈ విధానం ను కావాలని వ్యతిరేకించే, జ్ఞానాన్ని అప్తేడ్ చేసుకోలేని, డబ్బే పరమావధిగా భావించే కొద్దిమంది వైద్యులపట్ల అప్రమత్తంగా ఉండండి.
 41. ఏదైనా ఎవరు పడితే వారు చెపితే విని గందరగోళ పడడం కంటే సరైన సమాచారంతో ధైర్యంగా ముందడుగు వేయడం మంచిది. ఎవరు చెప్పినా వినండి. కానీ ఏది మంచిదో మీరే నిర్ధారించుకోండి.
 42. ఈ విధానం నియమిత కాలం పూర్తీ చేసాక ఎలా బయటకు రావాలి? ఆ తరువాత జీవితంలో ఆహారపు అలవాట్లలో ఏయే మార్పులు చేసుకుంటే జీవన శైలి వ్యాధులు తిరిగి రాకుండా ఉంటాయి? అనే విషయాలపైనా అవగాహన పెంచుకోవడం అత్యంత కీలకం. లేకుంటే మళ్ళీ ఎప్పటిలాగే విచ్చలవిడిగా ఉంటామంటే ఎప్పటిలాగే రోగాలూ మళ్ళీ రావడం ఖాయం.
-పల్లా కొండల రావు.
ఈ విధానంకు సంబంధించిన వీడియోలు, వ్యాసాలు జనవిజయంలో అందుబాటులో ఉంటాయి. ఏ సందేహం వచ్చినా స్వయంగా వీరమాచినేని రామకృష్ణ సమాధానాలు ఇస్తారు. ఆరోగ్యవంతమైన సమాజంకోసం, ఆనందకరమైన జీవన విధానం కోసం కృషి చేస్తున్న వీరమాచినేని రామకృష్ణ కు అండగా ఉండేందుకు జనవిజయం కూడా కృషి చేస్తుందని తెలియచేస్తున్నాము. ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన సమాజ నిర్మాణంలో మీరూ మీవంతు పాత్రను నిర్వహించండి.
ఆహరంలో, తినే విధానంలో మార్పులు చేయడం వలన, ఎలా జీవన శైలి వ్యాధులను దూరం చేసుకోవచ్చు? అనే కాన్సెప్ట్ కు సంబంధించిన ముఖ్యమైన విషయం గురించి తదుపరి వ్యాసంలో చర్చిద్దాం .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here