రాష్ట్రానికే ఆదర్శంగా ఖమ్మం జర్నలిస్టుల సమైక్య ఉద్యమం

0
26

రాష్ట్రానికే ఆదర్శంగా ఖమ్మం జర్నలిస్టుల సమైక్య ఉద్యమం

ఇండ్లు,స్థలాల సాధనే లక్ష్యం                      పాలకపక్షాల ఎత్తుకు పైఎత్తు
చిన్న పత్రికలు – పెద్ద ఉద్యమం                   ఐక్యత చెడకుండా జాగ్రత్తలు

 

ఖమ్మం నగరంలో జర్నలిస్టు యూనియన్లకు, చిన్నా,పెద్దా పత్రికలు అనే తారతమ్యం లేకుండా ఉద్యమిస్తున్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ తో పాటు పలు సందర్భాలలో మంత్రులు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ సంఘటితంగా ఉద్యమిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రవ్యాపితంగా చర్చనీయాంశమైంది. సోషల్‌ మీడియా వేదికగా ప్రతిరోజు ఖమ్మం జర్నలిస్టు ఇండ్ల స్థలా సాధన సమితి ప్రతి కార్యక్రమాన్ని అప్‌డేట్‌ చేస్తుండడంతో ఈ అంశం అందరినీ ఆలోచింపజేస్తున్నది.

గత 15రోజులుగా ఖమ్మంలోని చిన్నపత్రిక విలేఖరులంతా సమావేశమై ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలనీ, ముఖ్యంగా ఇండ్ల స్థలాలు, డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఉద్యమిస్తున్నారు. తొలుత కొద్దిమంది చిన్నపత్రికలవారితో ప్రారంభమైన ఉద్యమం అనతి కాలంలో పెద్దపత్రికలతోపాటు, అన్ని జర్నలిస్టు యూనియన్లు, అన్ని రాజకీయ పార్టీల వారి మద్దతు పొందింది.

    టి.డబ్ల్యు.జే.ఎఫ్ జిల్లా కార్యదర్శి పల్లా కొండలరావుకు వినతి పత్రం అందజేస్తున్న ఉద్యమకారులు 

నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేయడం, అన్ని వర్గాలు, పార్టీలు, యూనియన్ల, మేధావుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఒక టీంగా ఏర్పడి ప్రతి ఇంటికీ వెళ్ళి సమస్యను వివరిస్తూ అందరి మద్దతును అభ్యర్దిస్తున్నారు. ప్రభుత్వం ఏయే సందర్భాలలో జర్నలిస్టులకు ఏమేమి హామీలు ఇచ్చింది తేదీలు, సందర్భంతో సహా వివరిస్తున్నారు. వరంగల్‌, ఖమ్మం కార్పోరేషన్‌ ఎన్నిక సందర్భంలోనూ, ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ ఖమ్మం పర్యటనలోనూ విలేఖరుకు డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. సంఘాలకు అతీతంగా చిన్నా, పెద్దా పత్రకలనే గాక డెస్క్‌ జర్నలిస్టులకు కూడా డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లు ఇస్తామన్నారు. ఖమ్మంలో అయితే స్థలం చూసుకోవడమే తరువాయి అని స్వయంగా కె.సి.ఆరే ప్రకటించారు. జర్నలిస్టుల కాలనీ ఆదర్శంగా నిర్మించాలనీ, యూనియన్లు దగ్గరుండి మంచి స్థలం ఎంచుకోవాలని, పని అయ్యేదాకా కలెక్టరు వెంటపడాలని కూడా హితబోధ చేశారు. జర్నలిస్టుల కాలనీలో సకల సౌకర్యాలు కల్పిస్తామనీ, ఉచిత ఇంటర్నెట్‌ వంటి ఇతర సౌకర్యాలు కల్పిస్తామనీ సెలవిచ్చారు. ఈ అంశాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకుని బడ్జెట్‌లో ప్రవేశపెడతామన్నారు. ఆ తరువాత మంత్రులు కూడా పలు సందర్భాలలో ఇదేమాదిరి జర్నలిస్టులకు హామీలు ఇచ్చారు. స్వరాష్ట్రంలో జర్నలిస్టులు తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందనీ, తమ బతుకులు మెరుగు పడతాయని ఆశించిన తెంగాణ జర్నలిస్టులకు తీవ్ర నిరాశే ఎదురయింది.

 సి.పి.ఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావుకు వినతి పత్రం అందజేస్తున్న ఉద్యమకారులు

పెద్దలు హామీలు ఇచ్చి రెండేండ్లకు పైగా అవుతున్నా ఒక్క అడుగు కూడా మందుకు పడడం లేదు. పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కంటే పరిస్థితి దయనీయంగా తయారైంది. జి.ఓ 239 తో చిన్నపత్రికలకు తీరని అన్యాయం చేశారు. పత్రికలకు ప్రకటనలు ఇచ్చే విషయంలో తెంగాణ పత్రికలకు మొండిచేయి చూపి ఆంధ్రా పెట్టుబడిదారీ పత్రికలకే న్యాయం చేశారు. తెలన్గాణ కోసం మొదటి నుండి ముందు వరుసలో ఉండి పోరాడిన జర్నలిస్టులకు, మద్దతునిచ్చి వార్తలు కవరేజ్‌ చేసిన పత్రికలకు తెంలంగాణ ఏర్పాటైనాక తీరని అన్యాయం జరిగింది.

జి.ఓ 239 రద్దు చేయాలంటూ కూడా ఖమ్మంలో అప్పట్లో అందరు జర్నలిస్టు ఐక్యంగా పోరాడారు. కొంతమేరకు చిన్న పత్రికలకు న్యాయం చేసుకోగలిగారు కూడా. కొన్ని నిబంధనలను ప్రక్కకు బెట్టారు. అయితే పోరాటం లేకుంటే యూనియన్ల మధ్య అనైక్యతని సొమ్ము చేసుకుంటూ పాలకులు ఇండ్ల స్థలాలు, ఇండ్లు మంజూరి చేయడాన్ని వాయిదా వేస్తారనీ, కుంటి సాకులు చెపుతారనీ జర్నలిస్టులు అంచనాకి వచ్చారు. గతంలోనూ ఇలా మోసపోయిన దాఖలాలున్డడంతో దశాబ్ధాలుగా కలగానే మిగిలిపోతున్న ఇండ్ల సాధనకోసం ఏకైక ఎజెండాతో అందరూ సమాన భాగస్వామ్యంతో ఏరోజుకారోజు ఎజెండా రూపొందించుకుంటూ దశలవారీగా ఉద్యమించాలని ఖమ్మం జర్నలిస్టులు గత 15రోజులుగా విస్తృతంగా కృషి చేస్తున్నారు. యూనియన్లను పిలిచి జర్నలిస్టుల లిస్టు తయారుచేయమనడం, ఇండ్ల స్థలాలకు ఏ చోటు అనువైనదో గుర్తించమంటూ ప్రభుత్వం చెప్పడం, ఆ తరువాత వారి మధ్య ఐక్యత లేదని వాయిదాలు వేయడం చేస్తున్నారు.

    ఎం.ఎల్ పార్టీ నాయకులు గోకెనేపల్లి వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేస్తున్న ఉద్యమకారులు

ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి యూనియన్లను ప్రక్కనబెట్టి అన్ని యూనియన్లలోని కేడర్‌తో పాటు, అన్ని పత్రికలు, ఎక్ట్రానిక్‌ మీడియాకు చెందినవారు ఐకమత్యంతో కదిలి పని చేస్తుండం ఆహ్వానించదగ్గ, హర్చించదగిన పరిణామం. ఏ యూనియన్‌కూ తాము వ్యతిరేకం కాదని అందరూ ఏకైక ఎజెండాతో పనిచేయాలని, పాలకుల ఎత్తుకు చిత్తు కాకుండా ఉండేందుకే ఇలా ఇండ్లసాధన సమితిని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఉద్యమకారులు చెపుతుండడం విశేషం. ఏ యూనియన్‌ సభ్యులు ఆ యూనియన్‌లోనే పనిచేసుకుంటూ కేవలం ఇండ్ల సాధనకోసం మాత్రం ఒకే మాటపై ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

డిపిఆర్‌ఓ కార్యాయంలో అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల లిస్టుందనీ, ఖమ్మం చుట్టు ప్రక్కల ఎక్కడెక్కడ ఖాళీస్థలాలున్నాయో రెవెన్యూ అధికారులకు తెలుసునని అలాంటపుడు యూనియన్లపై బాధ్యతపెట్టి ఏవో కుంటి సాకు చెప్పి పాలకులు ఈ అంశాన్ని వాయిదా వేసే పద్ధతికి చరమగీతం పాడాలని కోరుతున్నారు. జర్నలిస్టులు కానీ, యూనియన్లు కానీ ఈ విషయంలో పాలకుల కుయుక్తులకు వంతపాడొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. కనుక ప్రభుత్వమే స్ఠల నిర్ధారణ చేసి అక్రిడిటేషను ఉన్న ప్రతి విలేఖరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరుతున్నారు. ఇదే విధంగా అన్ని మండలాలో కూడా మండల స్ధాయి విలేఖరులకు ఇండ్లు మంజూరి చేయాని కోరుతున్నారు.

అందరికీ అనువైన ఎజెండాతో ఐక్యంగా ముందుకు వెళుతున్న ఉద్యమానికి అన్ని యూనియన్లు, రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. అన్ని పత్రికల బ్యూరోలు అండగా ఉంటామనీ వార్తలు కవరేజ్‌ ఇస్తామని తెలిపారు. ఇప్పటికే జర్నలిస్టు సాధన సమితి టి.యుడబ్ల్యుజె (ఐజెయు), టిడబ్ల్యుజెఎఫ్‌, టియుడబ్ల్యుజె (టిజెఎఫ్‌) జర్నలిస్టు యూనియన్ల నాయకులు కట్టెకోల రామనారాయణ, పల్లా కొండరావు, ఆకుతోట ఆదినారాయణలతోపాటు, సిపిఎం,సిపిఐ, ఎం.ఎల్‌, కాంగ్రెస్‌, టిడిపి వంటి రాజకీయ పార్టీ నాయకు నున్నా నాగేశ్వరరావు, భాగం హేమంతరావు, గోకెనేపల్లి వెంకటేశ్వరరావు తదితరును కలిసి వారి మద్దతును కోరారు.

ఈ ఉద్యమాన్ని శాంతియుతంగా, ఐక్యంగా ముందుకు తీసుకుపోయేందుకు, ఫలితం సాధించేవరకూ పోరాడేందుకు కృషి చేస్తామని ఉద్యమ నాయకులు ఐతగాని జనార్ధన్‌, మూర్తి, రజనీకాంత్‌, పాషా, చక్రవర్తి, రాంబాబు తదితరులు ప్రకటించారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ అంశం రాష్ట్రవ్యాపితంగా కూడా వివిధ యూనియన్ల నాయకులు ఆరా తీస్తున్నారు. కేవలం కొద్దిరోజులకే పరిమితం అవుతుందనీ, అదీ ఖమ్మం నగరానికే పరిమితం అవుతుందనుకున్న ఉద్యమం ఖమ్మం జిల్లాకే గాక రాష్ట్రవ్యాపితంగా కూడా వ్యాపించే అవకాశాలు మెండుగా ఉన్నాయనడంలో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here