మహర్షి గా మహేష్! నేటి నుండి ‘రిషి’ జర్నీ ప్రారంభం!

0
25

సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. అభిమానులకు ప్రిన్స్ పుట్టిన రోజు బహుమతిగా ‘మహర్షి’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్ర నిర్మాతలు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పీవీపీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి  ‘మహర్షి’గా నామకరణం చేశారు. నాయకిగా పూజా హెగ్డే న‌టిస్తుండ‌గా, అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు, కేయూ మోహనన్‌ ఫొటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ హీరోగా నటిస్తున్న 25వ సినిమా కావడం, భరత్ అనే నేను బ్లాక్త బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమా విజయంపై పెద్ద ఎత్తున అంచనాలు పెంచుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వార్తను ఆసక్తిగా గమనిస్తున్నారు. మహేష్ ఈ సినిమాలో కొత్త లుక్ తో కనిపిస్తున్నారు. భరత్ గా యువ ముఖ్యమంత్రిగా నటించి మెప్పించిన మహేష్ ప్రస్తుతం విద్యార్ధిగా గెడ్డం, మీసాలు పెంచేసాడు. ఇప్పటివరకు మహేష్ మీసం తో నటించలేదు. డెహ్రాడూన్‌, హైదరాబాద్‌, గోవాలలో షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్ర నిర్మాణ పనులు ఏకధాటిగా కొనసాగుతున్నాయి. 2019 ఏప్రిల్‌ 5న ప్రపంచ‌వ్యాప్తంగా సినిమాని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ముందుగా పలువురు ఉహించినట్లుగా మూవీ పేరు ‘రిషి’ కాదని ‘మహర్షి’ అని తేలింది. ట్విటర్ లో తన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో మహేష్ షేర్‌ చేసుకున్నారు. ఓ చేతిలో ల్యాప్‌టాప్‌తో ఉన్న మహేష్‌.. మరో చేత్తో షర్ట్‌ కాలర్‌ను పట్టుకున్న ఈ ఫస్ట్‌లుక్‌ ఫొటోను బుధవారం అర్ధరాత్రి దాటాక సోషల్‌ మీడియాలో మహేష్‌ పోస్ట్‌ చేశారు. ఫ‌స్ట్‌లుక్‌కు ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తోంది. తమ హీరో రిషిగా చేస్తున్న ‘మహర్షి’ ఫస్ట్ లుక్ అదుర్స్ అంటూ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియాలో మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రిషి అనేది ఈ సినిమాలో మహేష్ పాత్ర పేరు. join the journey of RISHI అంటూ కేప్షన్ ఉంచారు. సో…. రిషిగా మహేష్ మహర్షి జర్నీ ప్రారంభమయిందన్నమాట.

-సినిమా డెస్క్, జనవిజయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.