‘భరత్ అనే నేను’ …….. ఆకట్టుకుంటున్న మహేష్ వాయిస్

0
30

మహేష్ ‘ముందడగు’ వేశాడు. సినిమా సినిమాకి క్రమంగా ఎదుగుతూ ప్రేక్షకుల గుండెల్లో ఒదుగుతున్న ప్రిన్స్ మహేష్ గణతంత్ర దినోత్సవం రోజు విడుదలైన ఆడియోలో మహేష్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇప్పటిదాకా చిన్ని చిన్ని డైలాగులకే పరిమితమైన మహేష్ “భారత్ అనే నేను” సినిమా లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న సన్నివేశం ఆడియోలో డైలాగ్ చెప్పిన విధానం తండ్రి కృష్ణ ను తలపించింది. హీరో కృష్ణ డైలాగ్ డెలివరీకి ఆంధ్రలో ఉన్న ప్రత్యేకత తెల్సిందే. ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకుడు. మహేష్ తండ్రి నటశేఖర కృష్ణ కూడా “ముఖ్యమంత్రి” అనే హిట్ సినిమాలో సి.ఎం గా నటించారు. నిజజీవితంలో కూడా హీరో కృష్ణ రాజకీయంగా కూడా సక్సెస్ కాగా మహేష్ మాత్రం రాజకీయాలలో తనకు ఓనమాలు కూడా తెలియవంటుంటాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here