బాలయ్యతో వినాయక్ సినిమా

0
19

నందమూరి బాలక్రుష్ణతోనే తన తదుపరి సినిమా ఉంటుందని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయకు స్పష్టం చేశారు. ప్రస్తుతం బాలయ్య ఎన్.టీ.ఆర్ బయోపిక్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన తండ్రి ఎన్.టి.ఆర్ పాత్ర పోషణతో పాటు సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే వినాయక్ సినిమా మొదలవుతుందని సమాచారం.బాలయ్యతో సినిమా వార్త‌పై ద‌ర్శ‌కుడు వినాయ‌క్ క్లారిటీ ఇచ్చారు. త‌న త‌ర్వాతి సినిమాలో హీరో బాల‌కృష్ణేన‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లోని ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వినాయ‌క్‌.. బాల‌య్య కోసం క‌థ సిద్ధం చేస్తున్న‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం ఆ ప‌నిలోనే తాను బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్లే కొంత గ్యాప్ వ‌చ్చింద‌ని చెప్పారు. స్పీడుగా సినిమాలు చేసే బాలయ్య తదుపరి సినిమా వినాయక్ డైరెక్షన్లో అన్న వార్త తెలిసిన బాలయ్య అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.