ప్రశ్నించండి!

0
37

‘ప్రజ’ లో మొదటి అక్షరం ప్రశ్నను, రెండో అక్షరం జవాబుని సూచిస్తుంది. ‘ప్రజ’ అంటే ‘ప్రజలు’ అనే అర్ధం కూడా ఉన్నది.  ప్రజ (ప్రశ్న జవాబుల) ద్వారా ప్రజ (ప్రజల) కు అవసరమైన అన్ని విషయాలలో చైతన్యాన్ని అందించవచ్చు. ఏదైనా అంశం పై మనకు సమాచారం తెలియాలంటే ఓ ప్రశ్న ద్వారా ఇతరులను అడగవచ్చు. మనకు తెలిసింది ఇతరులకు జవాబు ద్వారా చెప్పవచ్చు. ఇలా అందరూ కలసి ఓ విషయాన్ని నిర్ధారించే వీలుంటుంది. వివిధ అంశాలపై అంతర్జాలంలో ఉన్న మేధావుల సహకారం తీసుకోవడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి. ఈ వేదిక రాజకీయ, తత్త్వ, పాలన, మనో వైజ్ఞానికం వంటి వివిధ అంశాలో శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు సహాయకారిగా ఉంటుందని విశ్వసిస్తున్నాము. ఎప్పటికీ అన్ని విషయాలు అందరికీ తెలియవు కనుక, ఒకరికొకరు అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా ప్రజ అనేది ఓ వేదికగా ఉపయోగపడాలని ఆశిస్తూ ప్రయోగాత్మకంగా ఇది చేపట్టడం జరుగుతుంది. వివిధ అంశాలపై మీ అభిప్రాయాలను మాకు వ్రాసి పంపండి. మీ అభిప్రాయంతో పాటు మీ ఫోటో కూడా పంపండి. ఏదైనా అంశం చర్చ కు ఉంచాలనుకున్నా మాకు వ్రాయండి. మీ అభిప్రాయాలను జనవిజయం వారపత్రికలో కూడా ప్రచురించే అవకాశం ఉంది. మీ అభిప్రాయాలు పంపించాల్సిన మెయిల్ ఐ.డి: janavijayam@gmail.com

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here