ప్రతిపక్ష కూటమిలో చేరమంటున్న కేజ్రీవాల్

0
17

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకే కూటమిగా రావడం వలన దేశ అభివృద్ధికి ప్రయోజనం లేదని ఆప్ అధ్యక్షులు, ధిల్లీ సి.ఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.రానున్న 2019 సాధారణ ఎన్నికల నేపథ్యంలో భాజపాను ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకమవ్వాలన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అటువంటి కూటమిలో ఉండే పార్టీలకు దేశాభివృద్ధిలో ఎలాంటి కీలక పాత్ర ఉండదని కేజ్రీవాల్‌ అభిప్రాయపడ్డారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికలోనూ ఆప్‌ కాంగ్రెస్‌కు మద్దతివ్వని సంగతి తెలిసిందే. ఆమ్‌ ఆద్మీ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏ కూటమిలోనే చేరబోదని హరియాణాలోని రోహ్‌తక్‌లో విలేకరులతో మాట్లాడుతూ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. రానున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లోనూ, పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆప్‌ అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుందని వెల్లడించారు. ధిల్లీ అభివృద్ధికి తాము అన్నివిధాలా కృషి చేస్తుంటే కేంద్రం అడుగడుగునా అడ్డు తగులుతోందని ఆయన ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.