జర్నలిస్టుల ఇండ్లస్థలాల విషయమై సి.ఎం తో మాట్లాడతా!

0
20

జర్నలిస్టుల ఇండ్లస్థలాల విషయమై కే.సి.ఆర్ తో మాట్లాడతా!

ఖమ్మం ఎం.ఎల్.ఏ పువ్వాడ అజయ్ కుమార్ హామీ

ఖమ్మం, మార్చి 9, (జనవిజయం ప్రతినిధి): జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి కే.సి.ఆర్ తో మాట్లాడతానని, ఖమ్మం లో అందరు జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చేలా కృషి చేస్తానని ఎం.ఎల్.ఏ పువ్వాడ అజయ్ కుమార్ హామీ ఇచ్చారు. శుక్రవారం తనను కలసి వినతి పత్రం ఇచ్చిన ఖమ్మం ఇండ్ల సాధన సమితి ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ కే.సి.ఆర్ తో పాటు మంత్రులు కే.టి.ఆర్, తుమ్మల నాగేశ్వర రావులతో మాట్లాడతానని చెప్పారు. ముఖ్యమంత్రి తో సహా పలుసందర్భాలలో మంత్రులు జర్నలిస్టులకు హామీ ఇచ్చిన విషయాన్ని జర్నలిస్టు ప్రతినిధులు అజయ్ కు వివరించగా తప్పకుండా న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మంలో గత కొంతకాలంగా జర్నలిస్టుల ఇండ్ల సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమం జరుగుతోంది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టు సంఘాల నేతలు, పత్రికా ప్రతినిధులు , వివిధ రంగాల మేధావుల మద్దతును కోరుతున్న జర్నలిస్టులు శుక్రవారం ఖమ్మం ఎం.ఎల్.ఏ పువ్వాడ అజయ్ కుమార్ ను కలసి వినతి పత్రం అందజేశారు. ఖమ్మం డి.పి.ఆర్.ఓ కార్యాలయంలో ఉన్న వివరాల మేరకు అక్రిడేషన్ ఉన్న ప్రతి జర్నలిస్తుకూ ఇల్లు మంజూరీ చేయాలని జర్నలిస్టు ప్రతినిధులు కోరుతున్నారు. ఈ  కార్యక్రమంలో జర్నలిస్టు సాధనసమితి  ప్రతినిధులు ఐతగాని  జనార్ధన్, మూర్తి, కొరకోప్పుల రాంబాబు, మేడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here