చిరు బర్త్ డే కు సైరా టీజర్

0
23

మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమా ‘సైరా.. నరసింహారెడ్డి’. ఈ సినిమా టీజర్ ను ఈనెల 22న చిరు పుట్టినరోజు కానుకగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారట చిత్ర బృందం. గతేడాది చిరంజీవి బర్త్ డే స్పెషల్‌గా.. ‘సైరా.. నరసింహారెడ్డి’ టైటిల్‌ను ప్రకటించారు. ఈ ఏడాది ‘సైరా.. నరసింహారెడ్డి’ టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా తదితరులు ముఖ్య పాత్రలు పోషిసుత్న్నారు. 2019 వేసవి కానుకగా పలు భాషల్లో విడుదలకు ‘సైరా.. నరసింహారెడ్డి’ ముస్తాబవుతోంది. అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.