కే.సి.ఆర్ ఫ్రంట్ వెనుక వ్యూహం ఏమిటి?

0
44

దేశంలో ప్రస్తుతం థర్డ్ ఫ్రంట్ గురించిన చర్చలు జోరం దుకుంటున్నాయి. తెలంగాణా ముఖ్యమంత్రి కే.సి.ఆర్ జాతీయ రాజకీయాలోకి వస్తున్నట్లు బి.జే.పి, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా మూడోఫ్రంట్ ఏర్పాటుచేస్తానని ప్రకటించడంతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో ఈ అంశం చర్చనీయామ్శామయింది. అయితే ఇప్పటిదాకా బి.జే.పి తో అంటకాగి, అన్నింటా మోడీకి బాకా ఊడిన కే.సి.ఆర్ ఒక్కసారిగా బి.జే.పి పై విరుచుకుపడడం వెనుక అసలు కారణాలేమై ఉంటాయన్నది రాజకీయ విశ్లేషకులను ఆలోచింపజేస్తున్న అంశం. స్వప్రయోజనం లేకుండా కే.సి.ఆర్ ఇలాంటి ప్రకటన చేయరనేది మెజారిటీ అభిప్రాయం. అయితే అదేమిటన్నదే అందరి సందేహం. ఈ విషయమై పలు కోణాలలో వార్తలు వినపడుతున్నాయి. తెలంగాణలో కే.సి.ఆర్ పై పెరుగుతున్న వ్యతిరేకత, కాంగ్రెస్ బస్సు యాత్ర వంటి వాటినుండి దృష్టి మాలించడం ఓ కారణం కాగా, బి.జే.పి టి.ఆర్.ఎస్ ను చీల్చడానికి ప్రయత్నించిందనేది రెండో కారణంగా చెప్తున్నారు. అయితే దీనికి ఎలాంటి ఆధారం కనబడుట లేదు. ఇక అసలు కారణంగా అత్యధికులు భావించేది, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, జే.ఏ.సి నేత కోదండరాం వంటి వారు ఆరోపిచేది కుమారుడు కే.టి.ఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికి పన్నిన ఎత్తుగడ మూడో కారణం గా ఉంది.

తెలంగాణా కాంగ్రెస్ ను దెబ్బ తీసేందుకే!

కే.సి.ఆర్ మూడో ఫ్రంట్ ప్రకటన వెలువడ్డాక కాంగ్రెస్ బస్సు యాత్రకు మీడియాలో ప్రచారం కరువయింది. అసలే అనైక్యతతో సాగుతున్న తెలంగాణా కాంగ్రెస్ నేతలు కెసీఆర్ తాజా ప్రకటన వ్యూహంతో ఒక్కసారిగా కవరేజ్ మైలేజ్ తగ్గింది. దీంతో రాష్ట్రంలో ప్రత్యర్ధులను దెబ్బతీయడానికి కొంతకాలం ఈ అంశం బాగా ఉపయోగపదనున్నది. కేంద్రం సహకరించక పోవడం వల్లనే రైతులకు మేలు చేయలేకపోతున్నామని రైతులను ఆదుకునేది తాము మాత్రమేనని చెప్తున్నారు. 24 గంటల విద్యుత్, పంటకు ఎకరానికి 8 వేల ఆర్ధిక సహాయం పథకాల గురించి గట్టిగా చెప్తున్నారు. రైతులకు  తమ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను తగ్గించేందుకు ఆయన తాజా ఎత్తుగడ ఫలిచిందనే చెప్పాలి. రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ ను ఇలా దెబ్బతీయగా ఒక దెబ్బకు రెండు పిట్టలన్నంట్లు బిజెపి పై కూడా ఇదే అస్త్రాన్ని ఉపయోగించి లబ్ది పొందాలని చూస్తున్నారు.

బి.జే.పి పై అంత కోపమెందుకో?!

పథకం ప్రకారం టి.ఆర్.ఎస్ శ్రేణులు తమ నాయకునికి నీరాజనాలు పలుకుతూ ప్రకటనలు, కార్యక్రమాలు జోరు పెంచారు. జాతీయ స్థాయిలో మమతాబెనర్జీ, నవీన్ పట్నాయక్, స్టాలిన్, సిబుసోరెన్ వంటి వారితో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇది ప్రధాన పత్రికలలో వస్తున్నా వార్తల సారాంశం. పార్లమెంటులోనూ టి.ఆర్.ఎస్ ఎంపీలు ఏ.పీ కి ప్రత్యెక హోదా ఇవ్వాలంటూ ఏ.పి ఎంపీలకు మద్దతుగా గొంతు కలిపారు. ఇలా రోజూ ఈ అంశాన్ని పత్రికలలో, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో హల్చల్ చేసేలా కే.సి.ఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తాము బీ.జే.పి కి వ్యతిరేకంగా గట్టిగా ఉంటున్నట్లు దేశం మొత్తానికి సంకేతాలు పంపించారు. దానిని చర్చకు వచ్చేలా చేయగలిగారు. దేశంలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, రిజర్వేషన్లు వంటి విషయాలలో రాష్ట్రాలకు మాత్రమే అధికారాలు ఉండాలని, కేంద్రం అధికారాలను పరిమితం చేసేలా రాజ్యాంగ సవరణ చేయాలనీ కేంద్రం పెత్తనంపై విరుచుకుపడుతున్నారు. ఈ అంశం ఎప్పటినుండో చర్చలో ఉన్నదే కాగా ఇపుడు ఈ అంశం హటాత్తుగా కే.సి.ఆర్ కు గుర్తుకు రావడం మాత్రం వ్యూహత్మకమేనన్న దానిలో పరిశీలకులకు అనుమానాలు లేవు. ఇప్పటిదాకా కూతురుకు కేంద్రంలో మంత్రి పదవికోసమైతేనేమి, నిధుల రాబట్టుకోవదానికైతేనేమి కే.సి.ఆర్ మోడీకి గట్టి మద్దతుదారుగా ఉన్నారు. జి.ఎస్.టీ , నోట్ల రద్దు వంటి విషయాలలో మోడీకి అందరికంటే అత్యుత్సాహంగా జై కొట్టారు. ఇపుడు అంతే గట్టిగా వ్యతిరేకం గా ఉంటున్నట్లు చెప్తున్నారు. దీనికి కారణం బి.జే.పి హరీష్ రావు ద్వారా టిఆరెస్ ను చీల్చాలని చూసారని అందుకే కే.సి.ఆర్ హటాత్తుగా రూటు మార్చారంటున్నారు. హరీష్ అసంతృప్తి నిజమే అయినా ఆయన బిజెపి తో కలుస్తారనుకోడానికి ఆధారాలు లేవు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేల మద్దతుతో హరీష్ పార్టీ మారతారనే పుకారు కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. హరీష్ కాంగ్రెస్ లోకి వెళ్ళే చాన్స్ ఎక్కువుంది తప్ప బిజేపీ తో కలవరని ఇదంతా కేవలం పుకార్లు మాత్రమేనన్నది మెజారిటీ అభిప్రాయం.

కొడుకు కోసమేనా?!

ఇక అసలు కారణం కుమారుడు కే.టి.ఆర్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెత్తదడమే అసలు కారణంగా అందరూ భావిస్తున్న అంశం. కే.టి.ఆర్ ను సి.ఎం ని చేయడం కోసం కొత్త ఫ్రంట్ నాటకం మొదలెట్టాడని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. స్వీయ ప్రయోజనం లేకుండా కే.సీ.ఆర్ విశాలంగా ఆలోచిస్తారనేది భ్రమేనని అంటున్నారు. కొడుకుని సి.ఎం ని చేయాలంటే అద్దంకి గా ఉన్న సీనియర్లను ముఖ్యంగా హరీష్ రావును, తుమ్మల, కడియం, తలసాని వంటి వారిని ఇక్కడ పవర్ సెంటర్లుగా ఉండకుండా చూసేందుకు ఈ ఎత్తుగడ పన్నారన్నది అత్యధికుల అంచనా. వీరు ఎం.పీలుగా పోటీ చేయాలంటే అంగీకరించరని తెలుసు కనుక పార్టీలో చీలికలు రాకుండా తనతో సహా ముఖ్యులందరూ పార్లమెంటుకు వెళితే జాతీయ స్థాయిలో తర్డ్ ఫ్రంట్ ద్వారా అధికారం చేపట్టి కేంద్ర పదవులు తీసుకోవచ్చని కే.సి.ఆర్ చెప్తున్నారు. బి.జే.పీ పాలిత రాష్ట్రాలలో వ్యతిరేకత ఉందని మోడీ హవా తగ్గిన్దనీ కేంద్రంలో తర్డ్ ఫ్రంట్ కు అధికారం వస్తుందని కాంగ్రెస్ మద్దతు కూడా ఉండొచ్చన్నది కే.సి.ఆర్ హితబోధ గా చెప్తున్నారు. అయితే ఈ అంశాన్ని సీనియర్ మంత్రులు అంగీకరిస్తారా? వారు నమ్మగలరా? ఆ నమ్మకం కోసమే కెసిఆర్ నడుం బిగించారు. దేశమంతా తిరిగి ఫ్రంట్ ని బలోపేతం చేస్తానంటున్నారు. ఒక వేల ఫ్రంట్ సక్సెస్ కాకున్నా, కేంద్రంలో పదవులు రాకున్నా కుమారుడికి ముఖ్యమంత్రి పీతం మాత్రం ఖాయంగా ఉంటున్నది కే.సి.ఆర్ వ్యూహం. తర్డ్ ఫ్రంట్ అవసరం, అవకాశాలు ఎలా ఉంటాయన్నది కూడా మరో వైపు చర్చనీయామ్శంగా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here