కూల్చేస్తావా ?  భారత రాజ్యాంగాన్ని…..

0
28

కూల్చేస్తావా ?  భారత రాజ్యాంగాన్ని…..

కూల్చేస్తావా ? సన్యాసి ?
భారత రాజ్యాంగాన్ని…..
భారత రాజ్యాంగానికి భూమిక 
విదేశీ 1935 బ్రిటిష్ చట్టానిది.

కూల్చేస్తావా ? సన్యాసి ?
భారత రాజ్యాంగాన్ని….
“స్వేచ్చ సమానత్వం స్వాతంత్ర్యం” నినాదం
విదేశీ ఫ్రెంచ్ దేశానిది.

కూల్చేస్తావా ? సన్యాసి ?
భారత రాజ్యాంగాన్ని….
పీఠిక, ప్రాధమిక హక్కులు 
విదేశీ అమెరికా దేశానివి.

కూల్చేస్తావా ? సన్యాసీ ?
భారత రాజ్యాంగాన్ని….
ఆదేశిక సూత్రాలు
విదేశీ ఐర్లాండు దేశానివి.

కూల్చేస్తావా ? సన్యాసీ ?
భారత రాజ్యాంగాన్ని….
ఉమ్మడి జాబితా, వాణిజ్యం
విదేశీ ఆస్ట్రేలియా దేశానివి.

కూల్చేస్తావా ? సన్యాసీ ?
భారత రాజ్యాంగాన్ని….
రాజ్యాంగ సవరణ అధికారం 
విదేశీ దక్షిణ ఆఫ్రికా దేశానిది.

కూల్చేస్తావా ? సన్యాసీ ?
భారత రాజ్యాంగాన్ని….
న్యాయ ప్రక్రియ విధానం
విదేశీ జపాన్ దేశానిది.

కూల్చేస్తావా ? సన్యాసీ ?
భారత రాజ్యాంగాన్ని….
సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం
విదేశీ సోవియట్ రష్యా దేశానిది.

సన్యాసీ…….
మంచి ఏ దేశానిదైనా 
ఏ ప్రాంతానిదైనా 
స్వీకరించడం సంస్కారం.

కూల్చడం కాల్చడం
పాత రోత భావాలను 
పట్టుకు వేలాడడం ఛాందసం.

                                                               ……బండారు రమేష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here