ఏ.పీ లో క్రియాశీలకంగా రెబల్ స్టార్

0
13

ఏ.పీ లో పార్టీ పరిస్తితిని చక్కదిద్దే పనిలో భాగంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు ను తెరమీదకు తీసుకొస్తున్నారట బి.జే.పీ నేతలు. ఏ.పీ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా, హామీలు నెరవేర్చకుండా కేంద్రం మోసం చేసిందని రాష్ట్ర ప్రజలు బి.జే.పి పై కోపంగా ఉన్నారు. తెలుగుదేశంతో సంబంధాలు తెగాక ఎలాగైనా తమ పరిస్తితి దిగజారకుండా ఉండేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తాము గెలవగలిగే సీట్లుతో పాటు దాదాపు ప్రతి చోటా ప్రజాదరణ ఉన్న వారినే పోటీకి దింపాలని భావిస్తున్నారు. తెలుగుదేశం ను ఎలాగైనా గట్టి దెబ్బ తీయాలని మోడీ, అమిత్ షాలు కూడా భారీ స్కెచ్ వేస్తున్నారంటున్నారు. దీనిలో భాగంగా కృష్ణంరాజును రంగంలోకి దింపాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పార్టీ పరిస్తితిని వివరిస్తూ కృష్ణరాజు అధిష్టానంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏ.పీలో పార్టీని గట్టెక్కించేందుకు కీలకంగా వ్యవహరించాలని, రాష్ట్ర నాయకత్వానికి అండగా ఉండాలని కోరినట్లు సమాచారం. వాజ్ పాయి మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించిన కృష్ణంరాజు ఆ తరువాత అంట యాక్టివ్ గా లేరు. ఆయన పి.ఆర్.పి తరపున పోటీ కూడా చేశారు. అయితే పి.ఆర్.పి పతనం కావడం వాళ్ళ తిరిగి కృష్ణంరాజు బి.జే.పీలోకి వెళ్ళారు. పి.ఆర్.పి తరపున పోటీ చేసినా బి.జే.పీ అగ్రనేతలతో సత్సంబంధాలు కొనసాగించిన కృష్ణంరాజు పై బి.జే.పీ అధిష్టానం ప్రస్తుతం సానుకూల వైఖరితో ఉన్నది. పైగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న ప్రత్యెక పరిస్తితులలో కృష్ణం రాజు వంటి ప్రజాదరణ ఉన్నవారిని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. అయితే కృష్ణం రాజు లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తారా? లేక రాజ్యసభకు పంపుతారా? అన్నది హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. ఏమైనా ఇక కృష్ణంరాజు ఏ.పీ పాలిటిక్స్ లో యాక్టివ్ కానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.