ఎన్.టీ.ఆర్ లో చిరంజీవిని చూడగలమా?!

0
39

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఎన్.టీ.ఆర్ బయోపిక్ లో అతిధి పాత్రలపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నందమూరి తారకరాముడు సినిమాలలోనూ, రాజకీయాలలోనూ ఏ.పీలో నంబర్ వన్ గా రాణించారు. ఆయన సినీ, రాజకీయ జీవితంలో ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన కొన్ని పాత్రలను ప్రముఖ నటులతో పోషిమ్పజేస్తున్నారు. ఇందులో భాగమా ఎన్.టీ.ఆర్ సహనటుడు ఏ.ఎన్.ఆర్ పాత్రలో సుమంత్, ఎస్.వీ.రంగారావు పాత్రలో మోహన్ బాబు, కే.వీ.రెడ్డి పాత్రలో దర్షకు కృష్, శ్రీదేవి పాత్రలో రకుల్ వంటి కొన్ని పేర్లు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ హీరో కృష్ణ పాత్రతో పాటు, మెగాస్టార్ చిరంజీవి పాత్రలపై కూడా అంచనాలు, ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వివిధ రకాల కథనాలు వినిపిస్తున్నాయి. చిత్రబృందం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే ఈ సినిమాలో అతిధి పాత్రలు ఎక్కువయినట్లు దర్శకుడు భావిస్తున్నారని అందుకే ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదట. హీరో  కృష్ణ పాత్ర తప్పక ఉంటుందని దీనిని మహేష్ బాబు చేతనే పోషింపజేయాలని చూస్తున్నారట. ఈ నేపథ్యంలో అప్పట్లో విలన్గా, చిన్న పత్రాలు వేస్తున్న చిరంజీవి పాత్ర గురించి కూడా ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఎన్.టీ.ఆర్ హీరోగా నటించిన ‘తిరుగులేని మనిషి’ సినిమాలో చిరంజీవి చిన్న పాత్ర వేశారు. అప్పుడే కొద్దిగా ఎదుగుతున్న చిరంజీవి పాత్ర అవసరం ఉందని దర్షకుదు భావిస్తే ఎన్.టీ.ఆర్ బయోపిక్ లో చిరంజీవి పాత్ర ఉంటుందని, లేకుంటే ఉండకపోవచ్చని అనుకుంటున్నారు. ఒకవేల చిరంజీవి పాత్ర ఉంటే దానిని ఎవరు పోషిస్తారన్నది ప్రశ్నగా ఉన్నది. ఈ విషయాలన్నీ క్లారిటీగా తెలియాలంటే బాలయ్య టీం స్వయంగా ప్రకటించాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.