ఆగస్ట్ 15న ‘అరవింద సమేత వీర రాఘవ’ టీజర్

0
31

జూనియర్ ఎన్.టీ.ఆర్ అభిమానులకు శుభవార్త చెప్పారు ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రబృందం. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే కథానాయిక. ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర టీజర్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయనున్నారు. ‘‘మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్త. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ‘అరవిందసమేత’ టీజర్‌ను ఆగస్టు 15న విడుదల చేయనున్నాం. సమయాన్ని త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్ర నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్‌ పేర్కొంది. ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఎన్.టీ.ఆర్ అదే యాస పలకడమే గాక మరోసారి సిక్స్ ప్యాక్ తో సందడి చేయనున్నారు. దీనికోసం నిపుణుల సమక్షంలో ప్రత్యేక వ్యాయామాలు చేశారు. ఈ సినిమా దసరా కు విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.