అనంతం ఆ అభిమాన పవనం

0
13

పవన్ కళ్యాణ్ అభిమానులు అదో రకం. మిగతా హీరోలకంటే ఆమాటకొస్తే అన్న చిరంజీవి కంటే కూడా పవన్ అభిమానులకు అభిమానం ఎక్కువ. పవన్ ఎక్కడకు వెళ్ళినా వీరి హడావిడి ఉంటుంది. శనివారం అనంతపురం జిల్లా పర్యటనలో ఓ వీరాభిమాని హల్ చల్ చేశాడు. అనంతపురం సభకు కూడా అభిమానులు విపరీతంగా తరలి వచ్చారు. ఈ సభలో ఓ అభిమాని పోలీసులను, పార్టీ నేతలను దాటుకుని పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చాడు. పవణ్ కళ్యాణ్ ను గట్టిగా హత్తుకున్నాడు. పోలీసులు అతనిని పక్కకు లాగేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అభిమాని పట్టు విడువక పవన్‌తో సెల్ఫీ దిగడానికి ఉత్సాహం చూపాడు. దీంతో పవన్ అభిమానితో సెల్ఫీ దిగాడు. పవన్‌ను హత్తుకుని, సెల్ఫీ దిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని ఆ అభిమాని హర్షం వ్యక్తం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here